
పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఇతను ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ కమెడియన్. తెలంగాణలోని ఓ పల్లెటూరులో పుట్టి పెరిగాడు. చిన్నప్పటి నుంచే హరికథలు, బుర్రకథలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. మిమిక్రీ కూడా నేర్చుకున్నాడు. వన్స్ మోర్ ప్లీజ్ వంటి పలు టీవీ షోల్లో కూడా పాల్గొని సత్తా చాటాడు. కానీ సినిమా అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో చేసేదేమి లేక వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉద్యోగానికి చేరాడు. కొంత కాలం పాటు ప్రముఖ ఐఏఎస్ స్మితా సబర్వాల్ దగ్గర పని కూడా చేశాడు. కానీ నటనపై ఇష్టాన్ని వదులుకోలేకపోయాడు. మున్సిపల్ కార్పొరేషన్ లో ఉద్యోగానికి రాజీనామా చేసి దుబాయ్ వెళ్లిపోయాడు. అక్కడ రేడియో జాకీగా చేరాడు. అక్కడ అతని ప్రోగ్రాంకు మంచి రెస్పాన్స్ రావడంతో మళ్లీ హైదరాబాద్ కు వచ్చేశాడు. జబర్దస్త్ లో అవకాశం సంపాదించుకున్నాడు. స్టార్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత వెనక్కు తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. అతనే బలగం ఫేమ్ రచ్చ రవి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అతను తన సోషల్ మీడియా ఖాతాల్లో తన చిన్నప్పటి ఫొటోలను షేర్ చేశాడు. ఇదే సందర్భంలో తన సినిమా జర్నీని అభిమానులతో పంచుకున్నాడు.
‘కాక.. సినిమా ఫీల్డ్ రావడానికి ఏర్పాట్లు చేసుకునే క్రమంలో కష్టపడి 100 రూపాయలు సంపాదించుకొని నా మిత్రుడు వంశీ తో కలిసి
పెళ్లిళ్ల సీజన్లో బిజీగా ఉన్న ఒక ఫోటోగ్రాఫర్ నీ దొరక పట్టుకుని దారిలో తాళం వేసిన ఇంటిపైన గేటు తీసుకొని పోయి సినీ ప్రయాణానికి అవకాశాల వేటలో పరుగులు తీయడానికి మొదటి ఆల్బమ్ చేయించుకున్న రోజులవి. చలో కృష్ణ నగర్. ఇంద్రనగర్.. ఫిలింనగర్.. అని ఇద్దరు మిత్రులతో హైదరాబాద్ బయలుదేరా! ఎందుకో రాత్రి గుర్తొచ్చింది కాక మీతో చెప్పుకుందామని….. నేను మీ రచ్చ. నా సినీ ప్రయాణం వన్స్ మోర్ ప్లీజ్….. అబ్బబ్బ ప్లీజ్ వన్స్ మో అంటూ…. మనందరికీ ఇష్టమైన వేణుమాధవ్ అన్న షో ద్వారా షురూ అయింది… ఒకసారి రాత్రి గుర్తు చేసుకున్న మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్న… ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కొక్క అవకాశం ఒక గొప్ప అనుభవం… మీ అందరి ఆశీస్సులు.. 140 చిత్రాలు….. అవకాశం ఇచ్చిన సినీ రంగా పెద్దలకు, గురువులకు ప్రేక్షక దేవుళ్లకు శతకోటి వందనాలు.. నేను మీ రచ్చ రవి’ అంటూ ఎమోషనల్ అయ్యాడు రచ్చ రవి.
రచ్చ రవి షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్..
View this post on Instagram
రచ్చ రవి షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది.