
అందాల భామ నిధి అగర్వాల్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉంది. సవ్యసాచి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ చిన్నది ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. కానీ అంతగా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. ఆ సమయంలో పూరిజగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఈ అమ్మడికి మంచి విజయాన్ని అందించింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో తన అందాలతో కవ్వించింది నిధి. ఆతర్వాత షరామామూలే.. నిధి అగర్వాల్ ఆతర్వాత హిట్ రుచి చూడలేదు. ఇక ఇప్పుడు ఏకంగా ఇద్దరు స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేసింది. వాటిలో ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహరవీర మల్లు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. హరిహరవీరమల్లు సినిమా కోసం నిధి గుర్రపు స్వారీ, కత్తి యుద్ధంలాంటివి నేర్చుకుంది ఈ చిన్నది.
ఇది కూడా చదవండి : అప్పుడు ఆవేశంలో ఆత్మహత్య చేసుకుందామనుకుంది.. కట్ చేస్తే ఇప్పుడు స్టార్ హీరోయిన్
ఈ సినిమా తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా సాబ్ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. ఇటీవలే ఈ సినిమా నుంచి టీజర్ విడుదలైంది. ఇదిలా ఉంటే ఇటీవలే వెంకటేష్ త్రివిక్రమ్ సినిమాలోనూ నిధి అగర్వాల్ ను హీరోయిన్ గా ఫిక్స్ చేశారని కూడా టాక్ వినిపిస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ అభిమానులతో అప్పుడప్పుడూ ముచ్చటిస్తూ ఉంటుంది.
ఇది కూడా చదవండి :బాబోయ్.. ! ఈ ఫొటోలో ఉంది ఆ స్టార్ హీరోయినా..!! అస్సలు ఊహించలేరు గురూ..
సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేస్తున్న సమయంలో ఓ అభిమాని చేసిన పనికి తాను షాక్ అయ్యాను అని తెలిపింది నిధి. అభిమానులతో మాట్లాడుతుండగా ఓ ఫ్యాన్ మ్యారేజ్ టాపిక్ తీసుకొచ్చాడు అని తెలిపింది. ” మీ అమ్మగారి నెంబర్ ఇవ్వండి. మన పెళ్లి సంబంధం గురించి మాట్లాడతా. ప్లీజ్ ఇవ్వొచ్చుగా నిధి” అని అడిగాడట. దానికి నిధి అగర్వాల్ అవునా? చిలిపి.. అంటూ సమాధానం ఇచ్చింది.
ఇది కూడా చదవండి : అతను నా శరీరంలో అక్కడ చెయ్యివేశాడు.. పోలీసులకు చెప్తే ఇలా అన్నారు.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..