
ఆత్మవిశ్వాసం.. పట్టుదల ఉంటే ఎంతటి కఠినమైన పరిస్థితులను సైతం ఎదురించవచ్చు. ఈ విషయాన్ని ఇండస్ట్రీలో ఎంతో మంది నటీనటులు నిరూపించారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ డమ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరో.. తన తండ్రి పనిచేసిన హోటల్‌నే అతడికి బహుమతిగా అందించాడు. హిందీ సినిమా పరిశ్రమలో వరుస హిట్స్ అందుకుంటూ స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడు. ఒకప్పుడు వెయిటర్‌గా పనిచేసిన భవనాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చిన ఈ స్టార్ హీరో ఎవరో కాదు.. బీటౌన్ స్టార్ సునీల్ శెట్టి.. తన తండ్రి వీరప్ప శెట్టి కోసం ఎవరూ ఊహించని పనిచేశాడు. దాదాపు 30 ఏళ్లుగా సినీరంగంలో 100కి పైగా చిత్రాల్లో నటించాడు సునీల్ శెట్టి. హీరోగానే కాకుండా విలన్ పాత్రలలోనూ అదరగొట్టాడు. 1990లో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడు కూడా ఆయనే.
1992లో వచ్చిన బల్వాన్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టాడు. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. దీంతో అతడికి వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఆయనకు సొంతంగా పాప్ కార్న్ ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థ సైతం ఉంది. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన దర్బార్ చిత్రంలో విలన్ పాత్రలో రఫ్పాడించాడు. ప్రస్తుతం సునీల్ శెట్టి వయసు 63 సంవత్సరాలు. ఇప్పటికీ 25 ఏళ్ల కుర్రాడిగా కనిపిస్తూ యంగ్ హీరోలకు గట్టిపోటినిస్తున్నాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో సునీల్ శెట్టి మాట్లాడుతూ.. తన తండ్రి చిన్నప్పుడే ముంబైకి పారిపోయారని.. 9 9 ఏళ్ల వయసులో దక్షిణ భారత రెస్టారెంట్లో టేబుల్ క్లీనర్‌గా పనిచేశాడని.. రాత్రిపూట బియ్యం సంచుల మధ్య నిద్రపోయేవారని చెప్పుకొచ్చారు.
తాను సైతం చిన్నప్పుడు తండ్రి పనిచేసిన హోటల్లో సర్వెంట్ గా పనిచేశానని.. హీరోగా ఎదిగిన తర్వాత తన తండ్రి పనిచేసిన మూడంతస్తుల భవనాన్ని కొనుగోలు చేసి తండ్రికి బహుమతిగా ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం సునీల్ శెట్టి ఆస్తులు రూ.125కోట్లు అని సమాచారం. సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టి కథానాయికగా రాణించింది. ఆ తర్వాత భారత క్రికెటర్ కె.ఎల్ రాహుల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?
Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..