
ఓటీటీ సినీప్రియుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ చిత్రాలను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈమధ్య కాలంలో ఊహించని ట్విస్టులు.. థ్రిల్లింగ్ సీన్లతో వచ్చే క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఆద్యంతం సస్పెన్స్ మధ్య సాగే సినిమాలకు అడియన్స్ నుంచి మంచి ఆదరణ వస్తుంది. తాజాగా ఓటీటీలో ఓ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ దుమ్ములేపుతుంది. అదే గరుడ 2.0. దాదాపు తొమ్మిది సంవత్సరాల క్రితం అంటే 2016లో ఫిబ్రవరి 26న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. అయితే తమిళంలో ఆరతు సినమ్ అనే పేరుతో వచ్చిన ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో గరుడ 2.0 పేరుతో రిలీజ్ చేశారు. గతంలో తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. ఐఎమ్డీబీ నుంచి ఈ చిత్రానికి 6.8 రేటింగ్ వచ్చింది. దాదాపు తొమ్మిదేళ్లకు ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రానికి ఇప్పుడు మరోసారి మంచి రెస్పాన్స్ వస్తుంది.
ప్రస్తుతం ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా ఆహాలో టాప్ 1 ప్లేస్ ట్రెండింగ్ లో ఉందని మేకర్స్ తెలిపారు. అప్పట్లో థియేటర్లలో సత్తా చాటిన ఈ సినిమాకు ఇప్పుడు ఓటీటీలోనూ ఊహించని రెస్పాన్స్ వస్తుంది. హనుమాన్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రాన్ని నిర్మాత బాలు చరణ్ తెలుగులో రిలీజ్ చేశారు. ఇందులో ఐశ్వర్య రాజేశ్, డిమాంటీ కాలనీ పేమ్ అరుళ్ నిధి ప్రధాన పాత్రలు పోషించారు. తమిళంలో వరుస సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు అరుళ్ నిధి. ఇక ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది ఐశ్వర్య రాజేశ్.
ఈ చిత్రానికి అరివాజగన్ వెంకటాచలం దర్శకత్వం వహించారు. క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారికి గరుడ 2.0 సినిమా ఈ వేసవికి బెస్ట్ ఛాయిస్ అని చెప్పోచ్చు. ఇందులో ఐశ్వర్య రాజేశ్ అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇవి కూడా చదవండి :
Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?
Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..