Most Recent

OTT Movie: రూ.7 కోట్లతో తీస్తే రూ.75 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లలో బ్లాక్ బస్టర్.. ఇప్పుడు ఓటీటీలోకి..

OTT Movie: రూ.7 కోట్లతో తీస్తే రూ.75 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లలో బ్లాక్ బస్టర్.. ఇప్పుడు ఓటీటీలోకి..

సౌత్ ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. ఏమాత్రం హడావిడి లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించిన సినిమాల గురించి చెప్పక్కర్లేదు. అలాంటి వాటిలో టూరిస్ట్ ఫ్యామిలీ ఒకటి. భారీ బడ్జెట్ కాకుండా కేవలం రూ.7 కోట్లతో నిర్మించిన ఈ సినిమా థియేటర్లలో కేవలం రూ.75 కోట్లు మాత్రమే వసూల్లు రాబట్టింది. ఇటీవల విడుదలైన సూర్య రెట్రో చిత్రానికి పోటీగా వచ్చిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ చిత్రాన్ని కేవలం తమిళంలోనే రిలీజ్ చేశారు. కానీ ఈ మూవీకి వచ్చిన రెస్పాన్స్ చూసి తెలుగులోకి ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూశారు అడియన్స్. ఈ క్రమంలోనే తెలుగు ప్రేక్షకులకు గుడ్ న్యూస్ అందించారు మేకర్స్.

శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి అభిషాన్ అనే వ్యక్తి దర్శకత్వం వహించారు. అతడికి ఇదే తొలి చిత్రం కావడం విశేషం. ఇన్నాళ్లు యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ తీసిన అభిషాన్.. దర్శకుడిగా వెండితెరపై తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నారు. తమిళంలో మే 1న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ చిత్రాన్ని జూన్ 2 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ మూవీ అందుబాటులోకి రానుంది.

కథ విషయానికి వస్తే..

ధర్మదాస్ (శశికుమార్).. అతడి భార్య వాసంతి (సిమ్రాన్) ఇద్దరు కొడుకులతో కలిసి శ్రీలంక నుంచి అక్రమంగా మన దేశానికి వలస వస్తారు. ఇక వీరి ఫ్యామిలీ గురించి ఎవరికీ తెలియకుండా అతడి బావమరిది ధర్మదాస్ మేనేజ్ చేస్తుంటారు. ఎవరికీ ఏ విషయాలు చెప్పొద్దని చెప్తాడు. కానీ దాస్ ఫ్యామిలీ మాత్రం విచిత్రంగా ప్రవర్తించి చివరకు చిక్కుల్లో పడతారు. చివరకు దాస్ ఫ్యామిలీ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది.. ? అనేద సినిమా. థియేటర్లలో ఈ చిత్రానికి జనాలు క్యూ కట్టాయి. ఇక ఇప్పుడు ఈమూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది.

ఇవి కూడా చదవండి :  

Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..

Megastar Chiranjeevi: అమ్మ బాబోయ్.. చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్‏ గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్ అవ్వాల్సిందే..

OTT Movie: బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ.. 3 కోట్లతో తీస్తే రూ.70 కోట్ల కలెక్షన్స్.. 2 గంటలు నాన్‏స్టాప్ సస్పెన్స్..

Actress: ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.