Most Recent

Kamal Haasan: ప్రేమ ఎప్పుడూ క్షమాపణ చెప్పదు.. కన్నడ వివాదంపై స్పందించిన కమల్ హాసన్..

Kamal Haasan: ప్రేమ ఎప్పుడూ క్షమాపణ చెప్పదు.. కన్నడ వివాదంపై స్పందించిన కమల్ హాసన్..

సీనియర్ నటుడు కమల్ హాసన్ ఇటీవల కన్నడ భాషపై చేసిన కామెంట్స్ తీవ్ర దుపారం రేపిన సంగతి తెలిసిందే. చెన్నైలో జరిగిన థగ్ లైఫ్ మూవీ ఈవెంట్‏లో నటుడు శివరాజ్ కుమార్ ను ఉద్దేశిస్తూ.. కన్నడ కూడా తమిళం నుంచే పుట్టిందని అన్నారు. దీంతో కమల్ వ్యాఖ్యలపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో తాజాగా ఈ వివాదంపై కమల్ హాసన్ రియాక్ట్ అయ్యారు. తాను కేవలం ప్రేమతో చేసిన వ్యాఖ్యలేనని.. తనకు వేరే ఉద్దేశం లేదని అన్నారు. ప్రేమ ఎన్నడూ క్షమాపణ చెప్పదని అన్నారు. భాషా చరిత్ర గురించి ఎంతోమంది చరిత్రకారులు తనకు చెప్పారని.. భాష గురించి మాట్లాడే అర్హత రాజకీయ నాయకులకు లేదని .. ఇది కూడా తనకు వర్తిస్తుందని అన్నారు.

కమల్ హాసన్ మాట్లాడుతూ.. “నేను ప్రేమతో అలా చెప్పాను. ఎంతోమంది చరిత్రకారులు భాషా చరిత్ర గురించి నాకు చెప్పారు.. నేను చేసిన వ్యాఖ్యలలో మరో ఉద్దేశం లేదు. తమిళనాడు అరుదైన రాష్ట్రం. ఇక్కడ ప్రతి ఒక్కరిని మిళితం చేసుకునే తత్వం ఉంటుంది. ఓ మేనన్ (ఎంజీ రామచంద్రన్) ముఖ్యమంత్రిగా చేశారు. ఓ రెడ్డి (ఒమందూర్ రామసామి రెడ్డియార్) సీఎం అయ్యారు. మైసూర్ సంస్థానంలో పనిచేసిన నరసింహన్ రంగచారి మనవరాలు (జయలలితను ఉద్దేశిస్తూ) కూడా ముఖ్యమంత్రిగా చేశారు. చెన్నైలో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కర్ణాటక నాకు మద్దతుగా నిలిచింది. భాష గురించి మాట్లాడే అర్హత రాజకీయ నాయకులకు లేదు. నాకు కూడా ఇది వర్తిస్తుంది. దీనిపై లోతైన చర్చను చరిత్రకారులకు, పురావస్తు శాస్త్రవేత్తలు, భాషా నిపుణులకు వదిలేద్దాం”అని అన్నారు.

డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన థగ్ లైఫ్ చిత్రంలో కమల్ హాసన్, శింబు, త్రిష ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీపై మంచి హైప్ నెలకొంది. అయితే తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందనే కమల్ వ్యాఖ్యలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సహా పలువురు రాజకీయ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కన్నడ భాషకు ఉన్న చరిత్ర తమిళ నటుడికి తెలియదంటూ విమర్శలు గుప్పించారు.

ఇవి కూడా చదవండి :  

Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..

Megastar Chiranjeevi: అమ్మ బాబోయ్.. చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్‏ గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్ అవ్వాల్సిందే..

OTT Movie: బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ.. 3 కోట్లతో తీస్తే రూ.70 కోట్ల కలెక్షన్స్.. 2 గంటలు నాన్‏స్టాప్ సస్పెన్స్..

Actress: ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.