Most Recent

Mahesh Babu: పోకిరి మూవీని మిస్ అయ్యింది.. ప్రభాస్‏తో హిట్టుకొట్టింది.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఇలా..

Mahesh Babu: పోకిరి మూవీని మిస్ అయ్యింది.. ప్రభాస్‏తో హిట్టుకొట్టింది.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఇలా..

తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. యువరాజు, రాజకుమారుడు, ఒక్కడు, మురారి, పోకిరి వంటి హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన మహేష్.. ఇప్పుడు డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుంది. ఇదిలా ఉంటే.. మహేష్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ పోకిరి. డైరెక్టర్ పూరి జగన్నాథ్ రూపొందించిన ఈ సినిమా మహేష్ కెరీర్ ను మలుపు తిప్పింది. నిజం, నాని, అర్జున్ వంటి సినిమాలతో వరుసగా డిజాస్టర్స్ అందుకుంటూ సతమతమవుతున్న మహేష్ ను.. భారీ విజయాన్ని అందించిన సినిమా ఇదే. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ షేక్ చేసింది. ఈ సినిమాలో మహేష్ యాక్టింగ్, లుక్స్, డైలాగ్స్ గురించి చెప్పక్కర్లేదు. అప్పట్లో మహేష్ మ్యానరిజం యూత్ ను ఓ ఊపు ఊపేసింది.

మహేష్ బాబుకు మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టిన ఈ సినిమాలో ఇలియానా కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి జోడి ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. ఇక మణిశర్మ అందించిన మ్యూజిక్ సినిమాకే హైలెట్ అయ్యింది. కానీ పోకిరి సినిమాను మిస్ అయిన హీరోయిన్ ఎవరో మీకు తెలుసా.. ? నిజానికి ఈ సినిమాకు ఇలియానా ఫస్ట్ ఛాయిస్ కాదు. అప్పట్లో ఈ మూవీ కోసం బాలీవుడ్ హీరోయిన్ కావాలని అనుకున్నారట. అందుకే ముందుగా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ను పోకిరి మూవీ కోసం ఎంపిక చేశారు.

అయితే ఈ సినిమా ఛాన్స్ వచ్చినప్పుడు కంగనా హిందీలో గ్యాంగ్ స్టార్ అనే సినిమా చేస్తుంది. దీంతో డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో పోకిరి సినిమాను తిరస్కరించింది. ఆమె స్థానంలోకి ఇలియానాను తీసుకున్నారట. అయితే పోకిరి సినిమాను మిస్ అయినందుకు కంగనా ఎంతో బాధపడినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. పోకిరి సినిమాను మిస్ అయిన కంగనా.. ప్రభాస్ సరసన ఏక్ నిరంజన్ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు.. రాజకీయాల్లో బిజీగా ఉంటుంది.

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@kanganaranaut)

ఇవి కూడా చదవండి :  

Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..

Megastar Chiranjeevi: అమ్మ బాబోయ్.. చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్‏ గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్ అవ్వాల్సిందే..

OTT Movie: బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ.. 3 కోట్లతో తీస్తే రూ.70 కోట్ల కలెక్షన్స్.. 2 గంటలు నాన్‏స్టాప్ సస్పెన్స్..

Actress: ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.