
ఈ మధ్యకాలంలో కొంతమంది హీరోయిన్స్ ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిపోతున్నారు. చేసిన ఒకే ఒక్క సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ఇతర బాషల నుంచి వచ్చిన ముద్దుగుమ్మలు చాలా మంది తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే చాల ఏమండీ హీరోయిన్ అలా స్టార్స్ గా మారినవారే వారిలానే ఇప్పుడు మరో ముద్దుగుమ్మ కూడా తెలుగులో వరుస అవకాశాలతో దుసుకుపోతుంది. రీసెంట్ గానే భారీ హిట్ అందుకుంది. ఆమె నటించిన సినిమా ఏకంగా రూ. 300కోట్ల వరకు వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. అంతే కాదు ఈ సినిమా హిట్ తో ఈ చిన్నది ఏకంగా 4 సినిమా ఆఫర్స్ అందుకుంది. ఇంతకూ ఆ చిన్నది ఎవరో తెలుసా.?
శ్రీనిధి శెట్టి మోడల్ గా కెరీర్ మొదలుపెట్టి ఆతర్వాత మిస్ సుప్రనేషనల్ 2016 విజేత. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా కన్నడ, తెలుగు, తమిళ చిత్రాలలో నటిస్తుంది. 2015లో మిస్ కర్ణాటక , మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిళ్లను, 2016లో మిస్ సుప్రనేషనల్ ఇండియా టైటిల్ను గెలుచుకుంది. మిస్ సుప్రనేషనల్ 2016లో భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహించి, ఈ టైటిల్ను గెలుచుకున్న రెండో భారతీయురాలైంది. ఇక ముద్దుగుమ్మ 2018లో కన్నడ చిత్రం KGF: ఛాప్టర్ 1లో రీనా దేశాయ్ పాత్రతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో బ్లాక్బస్టర్ విజయం సాధించింది. KGF: ఛాప్టర్ 2 (2022)లో కూడా ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది.
రీసెంట్ గా తెలుగులోకి అడుగుపెట్టింది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హిట్ 3 సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అంతే కాదు ఈ సినిమా ఏకంగా రూ. 300కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ బ్యూటీకి ఇప్పుడు తెలుగులో వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే నాలుగు సినిమాలు లైనప్ చేసింది ఈ భామ. ప్రస్తుతం తెలుసు కదా అనే సినిమా చేసింది.. సిద్దు జొన్నలగడ్డ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాతో పాటు మరో మూడు సినిమాలు చేస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.