Most Recent

థియేటర్స్‌లో ఫ్లాప్.. ఓటీటీలో టాప్ .. ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న లేటెస్ట్ క్రేజీ మూవీ

థియేటర్స్‌లో ఫ్లాప్.. ఓటీటీలో టాప్ .. ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న లేటెస్ట్ క్రేజీ మూవీ

ఓటీటీలో సినిమాలకు కొదవే లేదు ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీలో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. రకరకాల జోనర్స్ లో సినిమాలు ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి. థియేటర్స్ లో వారం వారం కొత్త సినిమాలు రిలీజ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు విడుదలై భారీ విజయాలను అందుకుంటున్నాయి. తెలుగు సినిమాలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. వెయ్యి కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. అలాగే ఓటీటీలోనూ సినిమాలు అదరగొడుతున్నాయి. థియేటర్స్ లో ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఓటీటీలో మంచి టాక్ సొంతం చేసుకుంటున్నాయి. థియేటర్స్ లో డిజాస్టర్ అయిన సినిమాలు ఓటీటీలో ట్రెండింగ్ లో ఉంటున్నాయి. అలానే ఇప్పుడు ఓ సినిమా ఓటీటీని షేక్ చేస్తుంది.

ఆ సినిమా ఎదో కాదు సిద్దు జొన్నలగడ్డ నటించిన జాక్. ‘టిల్లు స్క్వేర్ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం “జాక్.. కొంచెం క్రాక్”. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఈ మూవీలో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్టర్ కావడం, సిద్దూ, వైష్ణవిలకు మంచి క్రేజ్ ఉండడంతో మొదటి నుంచి జాక్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. అలాగ టీజర్స్, ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేశాయి. దాంతో థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది ఈ సినిమా.. కానీ విడుదల తర్వాత సీన్ రివర్స్ అయ్యింది.

మొదటి షో నుంచే జాక్ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. రాను రాను అది కాస్త ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దాంతో జాక్ థియేటర్స్ లో పెద్దగా సందడి చేయలేకపోయింది. ఇక ఆతర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టింది. మే 8 నుంచి ఓటీటీలోకి అడుగుపెట్టింది ఈ సినిమా. ఓటీటీలో జాక్ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమాలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. కాగా ఓటీటీలో జాక్ మూవీ దూసుకుపోతుంది. ఈ సినిమా ఇప్పుడు టాప్ లో ట్రెండ్ అవుతుంది. నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్ లో టాప్ 2లో ఉంది జాక్ సినిమా. మీరు కూడా ఓటీటీలో జాక్ సినిమాను మిస్ అవ్వకండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.