Most Recent

BIgg Boss 9 : బిగ్ బాస్‌9లోకి సోషల్ మీడియా సెన్సేషన్.. అమ్మడి ఎంట్రీ పక్కా అంటున్న నెటిజన్స్

BIgg Boss 9 : బిగ్ బాస్‌9లోకి సోషల్ మీడియా సెన్సేషన్.. అమ్మడి ఎంట్రీ పక్కా అంటున్న నెటిజన్స్

తెలుగు బిగ్ బాస్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో భాషల్లో అలరిస్తున్న బిగ్ బాస్ గేమ్ షో.. ఇప్పుడు తెలుగులోనూ అలరిస్తుంది.. ఇప్పటికే ఈ రియాల్టీ గేమ్ షో తెలుగులో 8 సీజన్స్ ను పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు సీజన్ 9కు రంగం సిద్ధం అవుతుంది. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభంకానుంది. దాదాపు 105రోజుల పాటు జరిగే ఈ గేమ్ షో కోసం సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న వారు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతుంటారు. ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్స్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇప్పుడు త్వరలో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ హౌస్ లోకి ఓ ట్రెండింగ్ బ్యూటీ ఎంట్రీ ఇస్తుందని సోషల్ మీడియా కోడై కూస్తుంది.

ఆమె ఎవరో తెలుసా.? ఈ మధ్యకాలంలో అలేఖ్య చిట్టిపికిల్స్ ట్రెండ్ అయ్యింది. సోషల్ మీడియాలో రీల్స్ చేసి పాపులర్ అయ్యింది ఈ అమ్మడు. నెట్టింట అలేఖ్య చిట్టి పికిల్స్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇన్ స్టా గ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఒకటే ఆడియో, ఒకటే ట్రోల్స్.. ఎవరు చూసిన అలేఖ్య చిట్టిపికిల్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో పచ్చళ్లు బిజినెస్ చేస్తూ పాపులర్ అయిన ఈ అక్క చెల్లెళ్లు. సోషల్ మీడియాలో రీల్స్ చేసి ఫాలోవర్స్ ను పెంచుకున్నారు. అయితే ఇంత రేట్లు ఎందుకు అని అడిగినందుకు కస్టమర్స్ ను నోటికొచ్చిన బూతులు తిట్టడంతో ఈ అక్కాచెల్లెళ్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారారు.

రేట్స్ అడిగినందుకు పిచ్చి పిచ్చిగా తిట్టడం నోటికొచ్చినట్టు మాట్లాడటంతో ఫెమస్ అయ్యారు ఈ సిస్టర్స్. అయితే వీరిలో రమ్య మోక్ష అనే అమ్మడు మాత్రం తెగ పాపులర్ అయ్యింది. ఈ చిన్నది తన గ్లామర్ తో పాపులర్ అయ్యింది. హాట్ హాట్ రీల్స్ తో పాపులర్ అయ్యింది ఈ చిన్నది. ఇక ఇటీవలే ఈ చిన్నది ఓ సినిమా ఈవెంట్ లో కనిపించి అందరికి షాక్ ఇచ్చింది. ఇప్పుడు వరుసగా సినిమాల్లోనూ ఛాన్స్ అందుకుంటుంది ఈ చిన్నది. సినిమా ఈవెంట్ లో రమ్య కనిపించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రమ్యను కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఇంకొంతమంది ప్రశంసిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ అమ్మడు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు నెటిజన్స్. సోషల్ మీడియాలో క్రేజ్ వచ్చింది, సినిమాల్లో ఛాన్స్ వచ్చింది.. ఇక నెక్స్ట్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతుంది అంటున్నారు నెటిజన్స్. బిగ్ బాస్ హౌస్ లోకి రమ్య ఎంట్రీ ఇవ్వడం పక్కా అంటున్నారు. మరి ఈ చిన్నది బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతుందేమో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.