
సినిమా షూటింగ్స్ మనం అనుకున్నంత ఈజీగా ఉండవు. ఎంతో మంది కష్టపడితే కానీ ఓ సినిమా పూర్తికాదు. ఎండనక వాననకా సినిమా షూటింగ్స్ చేసి ఓ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారు. అయితే కొంతమంది దర్శకులు తమ సినిమాలను తక్కువ సమయంలోనే పూర్తి చేస్తుంటారు. మరికొందరు ఏళ్ల తరబడి చేస్తూ ఉంటారు. మన దగ్గర వారం రోజుల్లో సినిమా చేసిన వారు కూడా ఉన్నారు. బాహుబలి లాంటి సినిమా ఏకంగా ఐదేళ్లు కష్టపడి తీశారు. అయితే బాహుబలికి మించి టైమ్ తీసుకున్న సినిమా ఒకటి ఉంది. అంతే కాదు ఆ సినిమా రికార్డ్స్ తిరగరాసింది కూడా.. 14 ఏళ్లు షూటింగ్ చేశారు ఈ సినిమాను. ఈ సినిమా విడుదలైన తర్వాత విపరీతమైన క్రేజ్ వచ్చింది. సినిమా సంచలన విజయం సాధించింది. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.?
ఈ మధ్యకాలంలో సినిమాలను జెట్ స్పీడ్ తో షూట్ చేస్తున్నారు. కానీ అప్పట్లో ఇలా ఉండేది కాదు. కొన్ని సినిమాలు ఏడాదికి మించి సమయం పట్టేవి.. అలాంటి వాటిలో మొఘల్-ఏ-ఆజం అనే సినిమా ఒకటి. ఈ సినిమా బాలీవుడ్ లో తెరకెక్కింది. ఈ సినిమా షూటింగ్ 1944లో మొదలై 1960 పూర్తయ్యింది. ఈ డైరెక్టర్ కె. అసీఫ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కోసం డైరెక్టర్ కె. అసీఫ్ ఎంతో కష్టపడ్డాడు. సినిమాను తాను అనుకున్న విధంగా మలిచేందుకు కొన్నేళ్లు కష్టపడ్డాడు. ఈ సినిమా బడ్జెట్ ఆ కాలంలోనే రూ.1.5 కోట్లు.
ఇక ఈ సినిమాలో దిలీప్ కుమార్ హీరోగా నటించారు. అయితే ముందుగా ఆయన ఈ సినిమాలో నటించడానికి ఇష్టపడలేదట.. కానీ దర్శకుడు ఫోర్స్ చేసి సినిమా చేయించాడట. ముందుగా ఈ సినిమాకు చాంద్‌నీ బేగం అనే టైటిల్ పెట్టారు. ఆతర్వాత మార్చి మొఘల్-ఏ-ఆజం అని పెట్టారు. ఇక ఈ సినిమాలోని ప్యార్ కియా తో డర్నా క్యా సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈసాంగ్ షూట్ కోసం అప్పట్లోనే రూ. 10లక్షలు ఖర్చు చేశారట. ఇక 1960 ఆగస్టు 5న రిలీజైన ‘మొఘల్-ఏ-ఆజం’ సంచలన విజయం సాధించింది. అప్పట్లోనే ఈ సినిమా రూ. 11కోట్ల వరకు వసూల్ చేసిందంట. అంతే కాదు ఇతర దేశాల్లోనూ విడుదలై రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమా.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.