Most Recent

Ram Charan: పెద్దిలో ఆ క్రికెట్ షాట్ క్రెడిట్ అతనిదే.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్ బుచ్చిబాబు

Ram Charan: పెద్దిలో ఆ క్రికెట్ షాట్ క్రెడిట్ అతనిదే.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్ బుచ్చిబాబు

గేమ్ ఛేంజర్ లాంటి సినిమాల తర్వాత రామ్ చరణ్ ఎలాంటి సినిమాతో వస్తాడు అని చాలా మంది ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక ఈ సినిమా తర్వాత ఇప్పుడు పెద్ది సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు చరణ్. ఈ సినిమా  బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నాడు. ఉప్పెన సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఇప్పుడు పెద్ది సినిమా చేస్తున్నాడు బుచ్చిబాబు. రామ్ చరణ్ కెరీర్‌లో ఇది 16వ చిత్రం.  ఈ సినిమా నుంచి ఇటీవలే టైటిల్ తో పాటు ఓ వీడియో గ్లింమ్స్ ను విడుదల చేశారు.

సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల యాక్షన్ సీన్స్ చిత్రీకరణ జరిగినట్లు తెలుస్తుంది. ఇటీవలే శివరాజ్ కుమార్ ఈ సినిమా స్క్రిప్ట్‌ను పొగడ్తలతో ముంచెత్తారు, తన పాత్రను స్పెషల్‌గా ఉంటుందని పేర్కొన్నారు. అయితే, కాజల్ అగర్వాల్ స్పెషల్ సాంగ్‌లో నటిస్తుందనే వార్తలు ఉన్నప్పటికీ, దానిపై అధికారిక ప్రకటన రాలేదు.

ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి, రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు బుచ్చిబాబు ఆసక్తికర విషయాన్నీ పంచుకున్నారు. రీసెంట్ గా విడుదల చేసిన గ్లింమ్స్‌లో చివరిలో క్రికెట్ షేర్ షాట్ ఒకటి హైలైట్ అయ్యింది. ఆ షాట్ గురించి బుచ్చి బాబు మాట్లాడుతూ.. నేనెప్పుడూ రూటెడ్‌ స్టోరీలనే చెప్పాలనుకుంటుంటా.. ఫైట్‌ మాస్టర్‌ నవకాంత్‌ ఆ షాట్‌ను డిజైన్‌ చేశారని, అతడికే క్రెడిట్‌ ఇవ్వాలనుకుంటున్నానని అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.