
పుష్ప 2 సినిమాతో ఇండియాను షేక్ చేశాడు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు బన్నీ. ఇటీవలే అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా గురించిన అప్డేట్ వచ్చింది. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా అధికారిక ప్రకటన ఏప్రిల్ 8 ప్రకటించారు. ఈ సినిమా ప్రీప్రొడక్షన్ కు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. ఈ సినిమా ఒక పీరియడ్ డ్రామాగా, భారీ బడ్జెట్‌తో, అత్యధిక విజువల్ ఎఫెక్ట్స్ (VFX) సన్నివేశాలతో తెరకెక్కనుందని ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. అల్లు అర్జున్ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేయనున్నాడని, ఒక పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఉంటాయని ఇన్‌సైడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఈ సినిమా కోసం హాలీవుడ్ మేకర్స్ ను రంగంలోకి దింపనున్నారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ మరియు అట్లీ దుబాయ్‌లో స్టోరీ సిట్టింగ్స్‌లో పాల్గొంటున్నారని, ఇంకొన్ని రోజులు అక్కడే ఉండి ప్రీ-ప్రొడక్షన్ పనులను పూర్తి చేసే పనిలో ఉన్నారని సమాచారం. షూటింగ్ జూన్ 2025లో ప్రారంభమై, 2026 ఆగస్టులో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఒక విభిన్నమైన ప్రపంచాన్ని చూపించేలా రూపొందనుందని అంటున్నారు. హాలీవుడ్ సూపర్ హీరోల సినిమాల తరహాలో ఈ సినిమా ఉంటుందని తాజాగా ఇచ్చిన అప్డేట్ చూస్తే అర్ధమవుతుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేదాని పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మొన్నటివరకు ప్రియాంక చోప్రా పేరు వినిపించింది. ఆతర్వాత సమంత పేరు కూడా వచ్చింది. ఇక ఇప్పుడు మరో ముద్దుగుమ్మ పేరు వినిపిస్తుంది. ఆమె ఎవరో కాదు టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఈ బాలీవుడ్ బ్యూటీ తెలుగులో సీతారామం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ సినిమాలతో హిట్స్ అందుకుంది. కొంతకాలంగా సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చింది. చివరిగా కల్కి సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలో ఛాన్స్ అందుకుందని టాక్ వినిపిస్తుంది, మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.