-
2026 క్యాలెండర్లో స్టార్ హీరోల సందడి కాస్త ఎక్కువగానే కనిపించేలా ఉంది. మొదటిగా చిరు, తారక్ ఒకే సీజన్లో రాబోతున్నట్లు .సమాచారం. మిగతా హీరోలు కూడా బిగ్ రిలీజెస్కు రెడీ అవుతున్నారు.
-
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మార్చి డేట్ మీద ఆల్రెడీ ఖర్చీఫ్ వేసేశారు. బుచ్చిబాబు దర్శకత్వం వస్తున్న పెద్ది సినిమా 2026 మార్చ్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్.
-
ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో వస్తున్న ఫౌజీని నెక్ట్స్ ఇయర్ రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు. ఇందులో కొత్త భామ ఇమం ఇస్మాయిల్ హీరోయిన్. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
-
నాని కూడా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం చేస్తున్న ది ప్యారడైజ్ రిలీజ్కు డేట్ లాక్ చేశారు. బాలయ్య నుంచి వస్తున్న మోస్ట్ అవెయిటెడ్ సీక్వెల్ అఖండ 2, 2026 జనవరిలో విడుదల అవుతుందన్న ప్రచారం జరుగుతోంది.
-
పవన్ హీరోగా తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా 2026లోనే రిలీజ్ కానుంది. ఈ ఏడాది కుదరకపోతే ఓజి సినిమా కూడా 2026లో పక్క వచ్చేలా కనిపిస్తుంది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూట్ ఆల్మోస్ట్ పూర్తయిపోయింది.
-
అందరు హీరోలు బరిలో ఉన్నా... రేసులో నేను మాత్రం లేనంటున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. రాజమౌళి చేతుల్లో లాక్ అయిన మహేష్, 2027 లో రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు. సో 2024 సంక్రాంతికి వచ్చిన మహేష్... మళ్లీ ఆడియన్స్ ముందుకు వచ్చేంది 2027లోనే. అది కూడా జక్కన్న ఎలాంటి డిలేస్ లేకుండా సినిమా కంప్లీట్ చేస్తేనే అన్నమాట.