
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ హీరోగా నటించిన కలర్ ఫోటో సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. 2020లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా కట్టుకుంది. అమృతా ప్రొడక్షన్స్, లౌక్యా ఎంటర్టైన్మెంట్ పతాకాలపై సాయి రాజేష్, బెన్ని ముప్పానేని నిర్మించిన ఈ చిత్రానికి సందీప్ రాజ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సుహాస్ హీరోగా నటించగా చాందినీ చౌదరీ హీరోయిన్ గా నటించింది. సుహాస్ తొలిసారిగా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో చాందిని చౌదరితో పాటు సునీల్, వైవా హర్ష, ‘కంచరపాలెం’ ఫెమ్ సుబ్బారావు తదితరులు నటించారు. 1990లలో మచిలిపట్నం నేపథ్యంలో, ఒక సాధారణ యువకుడి జీవిత కథతో ఈ సినిమా రూపొందించబడింది. ఈ సినిమాలో సుహాస్ తో సహా అందరూ అద్భుతంగా నటించి మెప్పించారు.
అయితే ఈ సూపర్ హిట్ సినిమాను చేతులారా మిస్ చేసుకున్నా అని ఓ హీరోయిన్ తెలిపింది. కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్నందుకు ఇప్పటికీ బాధపడుతున్నా అని తెలిపింది ఆ బ్యూటీ. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? తెలుగు అమ్మాయి అయినా ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోతున్న ఆ హీరోయిన్ ఎవరో కాదు ప్రియా వడ్లమాని. ప్రియా వడ్లమాని. 2018లో వచ్చిన ప్రేమకు రెయిన్ చెక్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత శుభలేఖలు, హుషారు చిత్రాల్లో నటించింది.
అయితే హుషారు సినిమాతో ఈ బ్యూటీకి తెలుగులో మంచి క్రేజ్ వచ్చింది. ఒక్క సినిమాతోనే చాలా మంది ఫెవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. కానీ తెలుగులో ఆశించినంత ఆఫర్స్ అందుకోలేకపోయింది. ఇప్పుడు వరుసగా సినిమా ఛాన్స్ లు అందుకుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది ప్రియా. ఆమె మాట్లాడుతూ.. ఫేస్‌బుక్ లో నా ఫొటోస్ చూసి నాకు సినిమా ఆఫర్ వచ్చింది. 2015లో నా సినిమా జర్నీ మొదలైంది. కెరీర్ బిగినింగ్ లో నాకు కలర్ ఫోటో ఆఫర్ వచ్చింది. కానీ నేను ఆ సినిమాను మిస్ చేసుకున్నా.. అప్పట్లో నాకు సరిగ్గా గైడ్ చేసేవారు లేరు. నేను సినిమా ఫిలిం బ్యాగ్రౌండ్ నుంచి రాలేదు. నేను సినిమా ఓకే చేయాలంటే నేను,అమ్మ, నాన్న ముగ్గురం కలిసి నిర్ణయం తీసుకోవాలి. కలర్ ఫోటో ఆఫర్ వచ్చినప్పుడు నాకు సమయం కావాలి అని చెప్పాను. అలాగే పల్లెటూరి అమ్మాయి పాత్రకు నేను సెట్ కాను అని వాళ్ళు ఫీల్ అయ్యారు. అలా కలర్ ఫోటో సినిమా మిస్ అయ్యాను అని చెప్పుకొచ్చింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి