
అందాల భామలు తమన్నా, కాజల్ అగర్వాల్ ను పోలీసులు విచారించనున్నారు. పుదుచ్చేరిలో జరిగిన క్రిప్టో కరెన్సీ మోసానికి సంబంధించి తమన్నా, కాజల్ ను పోలీసులు విచారించనున్నారని తెలుస్తుంది. ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ను విచారించాలని పుదుచ్చేరి పోలీసులు నిర్ణయించారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని జనాలను మోసం చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది. లాభాలు ఆశ చూపి 10 మంది నుంచి సుమారు రూ.2.40కోట్లు వసూలు చేశారని అశోకన్ అనే విశ్రాంత అనే ప్రభుత్వ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
క్రిప్టో కరెన్సీ కంపెనీ 2022లో కోయంబత్తూరు మెయిన్ బ్రాంచ్ ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్టార్ హీరోయిన్ తమన్నా పాల్గొన్నారు. అలాగే మహాబలిపురంలోని ఓ స్టార్ హోటల్‌లో జరిగిన క్రిప్టో కరెన్సీ కంపెనీ కార్యక్రమానికి మరోస్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ హాజరయ్యారు. ఆ తర్వాత ముంబయిలో భారీ పార్టీ నిర్వహించి, వేలాది మంది నుంచి డబ్బు సేకరించారు.
లాభాలు చూపు జనాలను మోసం చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే నితీష్ జెయిన్(36), అరవింద్‌కుమార్(40)లను అరెస్ట్ చేశారు. ఇక ఇప్పుడు కేసు దర్యాప్తులో భాగంగా తమన్నా, కాజల్ అగర్వాల్‌లను విచారించాలని పుదుచ్చేరి పోలీసులు నిర్ణయించారు. దీని పై తమన్నా , కాజల్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.