
ఈ క్రమంలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా ఇప్పుడీ సినిమా గురించి మాట్లాడారు. ఇటీవల జరిగిన 98వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనం ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ ఛావా సినిమా పై ప్రశంసలు కురిపించారు. ఛావా సినిమా పేరు ప్రస్తుతం అంతటా వినిపిస్తోందని మోదీ అన్నారు. దేశంలో మరాఠీ భాష చాలా గొప్ప దళిత సాహిత్యాన్ని అందించిందని, మహారాష్ట్ర ప్రజలు గతంలో సైన్స్, ఆయుర్వేదం, లాజికల్, రీజనింగ్ వంటి వాటికి అద్భుతమైన కృషి చేశారని మోదీ అన్నారు. మహారాష్ట్ర, ముంబై కేవలం హిందీ సినిమాలు మాత్రమే కాకుండా మరాఠీ చిత్రాల స్థాయిని పెంచడంలో కీలక పాత్ర పోషించిందని మోదీ చెప్పుకొచ్చారు.