Most Recent

Vishal : కోలుకున్న విశాల్.. ఆనందంలో అభిమానులు.. వీడియో వైరల్

Vishal : కోలుకున్న విశాల్.. ఆనందంలో అభిమానులు.. వీడియో వైరల్

విశాల్ కోలుకున్నారు. యాక్షన్ హీరో విశాల్ ఫ్యాన్స్ ప్రస్తుతం ఆనందంతో తేలిపోతున్నారు. నిన్న మొన్నటి వరకు తమ అభిమాన హీరో ఆరోగ్యపరిస్థితి పై ఆందోళన వ్యక్తం చేసిన అభిమానులు.. ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నారు. విశాల్ ఆరోగ్యం గురించి రీసెంట్ గా చాలా వార్తలు వచ్చాయి. కొంతకాలంగా విశాల్ సైలెంట్ గా ఉంటున్నారు. చాలా కాలం తర్వాత మగదరాజ్ దాదాపు 12 ఏళ్ల తర్వాత విశాల్ హీరోగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమా పేరు మద గజ రాజా. ఈ సినిమాకు నటుడు సుందర్ సి దర్శకత్వం వహించారు. నిజానికి ఈ సినిమాను 2013లో విడుదల చేయాలి. కానీ అప్పుడు విడుదల ఆగిపోయింది. విశాల్ నటించిన ఈ చిత్రంలో అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్‌లు కలిసి నటించారు. తాజగా ఈ సినిమా ప్రెస్ మీట్ ను నిర్వహించారు.

ఈ ఈవెంట్ లో విశాల్ ను చూసి అందరూ షాక్ అయ్యారు. ఉన్నట్లుండి గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు విశాల్. బాగా బక్కచిక్కిపోయి కనీసం మాట్లాడలేకపోతున్నాడు. చేతులు కూడా వణికిపోతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. విశాల్ కు ఏమైందోనని తెగ కంగారు పడ్డారు. అయితే దీని పై వైద్యులు, పలువురు సినీ ప్రముఖులు క్లారిటీ ఇచ్చారు. విశాల్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని తెలిపారు.

డెంగ్యూ జ్వరంతో విశాల్ బాధపడుతున్నారని అందుకే ఆయన అనారోగ్యంగా కనిపించారని తెలిపారు. తన సినిమా దాదాపు 12ఏళ్ల తర్వాత విడుదల కావడంతో ఆరోగ్యం సహకరించకపోయినా విశాల్ ప్రెస్ మీట్ కు వచ్చారని నటి ఖుష్బూ తెలిపారు. ఇదిలా ఉంటే తాజగా విశాల్ సినిమా ప్రీమియర్ షోకు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోలు విశాల్ పూర్తిగా కోలుకున్నట్టు కనిపిస్తుంది. ఎప్పటిలానే సూపర్ స్టైలిష్ గా కనిపించారు విశాల్. దాంతో విశాల్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.