Most Recent

Sukumar: 13 ఏళ్ల ప్రాయంలోనే ఆ ధైర్యం చేసిన సుకుమార్ కూతురు.. స్టేజిపై ఏడ్చేసిన తల్లి బబిత.. వీడియో

Sukumar: 13 ఏళ్ల ప్రాయంలోనే ఆ ధైర్యం చేసిన సుకుమార్ కూతురు.. స్టేజిపై ఏడ్చేసిన తల్లి బబిత.. వీడియో

పుష్ప 2 సినిమాతో సుకుమార్ పేరు మరోసారి మార్మోగిపోయింది. ఆయన తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా రూ. 1850 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తద్వారా భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన రెండో సినిమాగా రికార్డుల కెక్కింది. ఇప్పుడు సుకుమార్ సినిమా వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన కూతురు సుకృతి వేణి సినిమాల్లోకి అడుగు పెట్టింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాంధీ తాత చెట్టు. పద్మావతి మల్లాది తెరకెక్కించిన ఈ సందేశాత్మక చిత్రం రిలీజ్ కు ముందే ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో గాంధీ తాత చెట్టు సినిమాను ప్రదర్శించారు. అలాగే ఉత్తమ బాలనటిగా సుకుమార్ కూతురికి కూడా అవార్డు వచ్చింది. ఇలా ఎన్నో విశేషాలున్న గాంధీ తాత చెట్టు ఇప్పుడు థియేటర్లలోకి రానుంది. గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్లలో భాగంగా తాజాగా చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సుకుమార్ తో పాటు అతని భార్య బబిత, కూతురు సుకృత వేణి తో పాటు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సుకుమార్ భార్య తన కూతురును తల్చుకుని ఎమోషనలైంది. 13 ఏళ్ల ప్రాయంలోనే తన కూతురు గుండు కొట్టించుకుని ఎవరూ చేయలేని సాహసం చేసిందని కన్నీళ్లు పెట్టుకుంది.

‘ డైరెక్టర్ కూతురు కాబట్టి సినిమాల్లోకి వస్తుంది అనుకోకూడదు. ఈ సినిమా అవార్డులకు వెళ్తే చాలు అనుకున్నాను. అందరూ అభినందించడం మొదలయ్యాక ఈ సినిమా అందరికి చేరాలని అనుకున్నాను. మొదట నా కూతురి ట్యాలెంట్ నేను గమనించలేదు. నా కూతురు ఫస్ట్ షాట్ చూసి సుకుమార్ కి కాల్ చేసి చాలా బాగా చేస్తుంది అని ఎగ్జైట్ అయ్యాను. ఈ సినిమాలో తను హెయిర్ షేవ్ చేసుకున్నది చూస్తుంటే ఎమోషనల్ అయ్యాను. తను ఈ సినిమా చేస్తున్నప్పుడు 12 ఏళ్ళు. తనని చూసి గర్వపడుతున్నాను. టీనేజ్ లో ఉన్న ఏ అమ్మాయి కూడా గుండు కొట్టించుకోవడానికి ఒప్పుకోదు. కానీ తను చేసింది’ అంటూ కూతురి గురించి చెప్తూ స్టేజిపైనే ఏడ్చేసింది బబిత. దీంతో సుకుమార్ స్టేజిపైకి వచ్చి తన భార్యని ఓదార్చాడు.

వీడియో ఇదిగో..

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. గాంధీ తాత చెట్టు సినిమాను సుకుమార్‌ రైటింగ్స్, గోపీటాకీస్‌ సంస్థలతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు నిర్మించారు. సుకుమార్ భార్య, శ్రీమతి తబితా సుకుమార్‌ సమర్పకురాలుగా వ్యవహరించారు.

గాంధీ తాత చెట్టు సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.