Most Recent

Aman Jaiswal: రోడ్డుప్రమాదంలో సీరియల్ నటుడు మృతి.. 23 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు..

Aman Jaiswal: రోడ్డుప్రమాదంలో సీరియల్ నటుడు మృతి.. 23 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు..

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గత రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో హిందీ సీరియల్ నటుడు అమన్ జైస్వాల్ మృతిచెందారు. అతడి వయసు కేవలం 23 సంవత్సరాలు మాత్రమే. అమన్ జైస్వాల్ ప్రమాదం గురించి రచయిత ధీరజ్ మిశ్రా ధృవీకరించారు. ఓ సీరియల్ ఆడిషన్ కోసం వెళ్లిన అమన్ జైస్వాల్ తిరిగి వస్తున్న సమయంలో ముంబైలోని జోగేశ్వరి హైవేపై అతడు ప్రయాణిస్తున్న బైక్ ను ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో అమన్ మరణించినట్లు సమాచారం. అమన్ జైస్వాల్ ‘ధర్తిపుత్ర నందిని’ సీరియల్ ద్వారా చాలా ఫేమస్ అయ్యాడు.

అమన్ జైస్వాల్ ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా నివాసి. ‘ధర్తిపుత్ర నందిని’ చిత్రంలో అమన్ ప్రధాన పాత్రలో కనిపించారు. సోనీ టీవీ సీరియల్ ‘ పుణ్యశ్లోక్ అహల్యాబాయి’లో యశ్వంత్ రావు పాత్రను అమన్ పోషించారు . 2021లో ప్రారంభమైన ఈ సీరియల్ 2023లో ముగిసింది. అమన్ మోడలింగ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించాడు. అమన్‌కి బైక్‌ నడపడం అంటే చాలా ఇష్టం. ఎక్కడికైనా బైక్‌పై వెళ్లేవాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అతని చాలా వీడియోలు బైక్ రైడింగ్ ఉన్నాయి. అతను మంచి గాయకుడు కూడా. అమన్ అకాల మరణంపై బుల్లితెర నటీనటులు, అభిమానులు తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేస్తున్నారు.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

అమన్ స్నేహితుడు అభినేష్ మిశ్రా మాట్లాడుతూ… అమన్ బైక్ ప్రమాదానికి గురైందని తెలిసిన వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారని.. అయితే ఆసుపత్రికి చేరిన అరగంటకే అతడు మృతి చెందినట్లు తెలిపాడు. ఆడిషన్ కోసం స్క్రీన్ టెస్ట్ షూట్ చేయడానికి అమన్ సెట్స్‌కి వెళ్లాడని.. అక్కడి నుంచి తిరిగి వస్తున్న సమయంలోనే యాక్సిడెంట్ జరిగినట్లు తెలిపారు. ధర్తీపుత్ర నందిని సీరియల్ కంటే ముందు అమన్ చాలా సీరియల్స్ లో చిన్న చిన్న పాత్రలు పోషించాడు.

 

View this post on Instagram

 

A post shared by Aman Jaiswal (@aman__jazz)

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.