Most Recent

Sudeep Pandey: మరొక యంగ్ హీరోను బలితీసుకున్న మాయదారి గుండెపోటు.. సినిమా షూటింగ్‌లోనే కుప్పకూలిన వైనం

Sudeep Pandey: మరొక యంగ్ హీరోను బలితీసుకున్న మాయదారి గుండెపోటు.. సినిమా షూటింగ్‌లోనే కుప్పకూలిన వైనం

ప్రముఖ భోజ్‌పురి నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు సుదీప్ పాండే గుండెపోటుతో కన్నుమూశారు. ముంబైలో ఓ సినిమా షూటింగ్‌లో ఉండగానే అతను గుండెపోటుతో కుప్పకూలాడు. సుదీప్ కేవలం నటుడే కాదు. అభిరుచిగల నిర్మాత కూడా. రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. అలాంటిది చిన్న వయసులోనే అతను గుండెపోటుతో కన్నుమూయడం అందరినీ కలచివేస్తోంది. సుదీప్ మరణ వార్తతో అతని కుటుంబ సభ్యులు, అభిమానులు శోకసంద్రలో మునిగిపోయారు. జనవరి 5న సుదీప్ పుట్టినరోజు జరుపుకున్నారు. అభిమానులు అతనికి పుట్టిన శుభాకాంక్షలు తెలిపారు. బర్త్ డే సెలబ్రేషన్ ముగించుకుని తన తదుపరి సినిమా షూటింగ్ కోసం ముంబై వచ్చాడు. ఎప్పటిలాగే బుధవారం( జనవరి 15) ఓ సినిమా షూటింగులోకు సుదీప్ పాండే హాజరయ్యారు. అయితే ఉన్నట్లుండి అతను గుండెపోటుతో కుప్పకూలాడు. ఆ తర్వాత ఆస్పత్రిలో చేర్పించినా ఫలితం లేకపోయింది భోజ్‌పురి సినీ పరిశ్రమలో సందీప్ కు యాక్షన్ హీరోగా ప్రత్యేక గుర్తింపు ఉంది. నటనతో పాటు నిర్మాణంలో కూడా పాలుపంచుకున్నాడు. సుదీప్ మరణ వార్త విషయాన్నిఅతని సన్నిహితులు సోషల్ మీడియాలో ధృవీకరించారు.

సుదీప్ పాండే 2007లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ‘భోజ్‌పురి భయ్యా’ అతని మొదటి సినిమా. తక్కువ కాలంలోనే యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ఖూనీ దంగల్’, ‘మసీహా బాబు’, ‘హమర్ సంగీ బజరంగీ బాలి’, ‘హమర్ లాల్కర్’, ‘షరాబీ’, ‘ఖుర్బానీ’ వంటి సినిమాల్లో సుదీప్ నటించాడు. సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు. ఎన్సీపీ పార్టీ లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడీ యంగ్ హీరో. సినిమాల్లోకి రాకముందు అతను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా కూడా పనిచేశాడు.

ఫిట్ నెస్ కు ప్రాధాన్యం

సుదీప్ పాండే ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. రోజూ జిమ్‌లో గంటల తరబడి వ్యాయామం చేసేవాడు. అతనికి హ్యాండ్సమ్ హంక్ అనే పేరు కూడా ఉంది. ఇంత ఫిట్‌గా ఉన్నా సుదీప్ కు గుండెపోటు ఎందుకు వచ్చిందనే ప్రశ్న మరోసారి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కాగా సుదీప్ పాండే కూడా ఆర్థిక సమస్యల్లో ఉన్నాడని అతని స్నేహితుడు చెప్పాడు. ‘విక్టర్‌’ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఫ్లాప్ కావడంతో సుదీప్ తన డబ్బులన్నీ పోగొట్టుకుని అప్పుల పాలయ్యాడంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.