తెలుగులో జోరు తగ్గించింది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించిన ఈ కేరళ కుట్టి.. ఇప్పుడు ఎప్పుడో ఒక సినిమా చేస్తుంది. చివరిగా సిద్ధు జొన్నలగడ్డ సరసన టిల్లు స్క్వేర్ సినిమాలో కనిపించింది. ఈ చిత్రంలో గ్లామర్ బ్యూటీగా కనిపించి ఒక్కసారిగా కుర్రాళ్లకు షాకిచ్చింది. అయితే ఈ సినిమా తర్వాత మాత్రం అమ్మడు ఫిల్మ్ జర్నీ స్లో అయ్యింది. ప్రస్తుతం పరదా సినిమాలో నటిస్తుంది. అటు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే అనుపమ.. తాజాగా లవ్ గురించి ఆసక్తికర పోస్ట్ చేసింది. ‘ఐ లవ్ యూ ఎప్పటికీ’ అని చెప్పడం అతి పెద్ద అబద్ధమని, ట్యాక్సీ ప్రేమ నుంచి పారిపోవాలంటూ ప్రేమికులకు సలహా ఇస్తూ పోస్ట్ పెట్టింది. దీంతో ప్రస్తుతం అనుపమ షేర్ చేసిన పోస్టు నెట్టింట తెగ వైరలవుతుంది.
అనుపమ పరమేశ్వరన్ ఫిబ్రవరి 1996లో కేరళలోని త్రిసూర్‌లో జన్మించారు. 2015లో అల్ఫోన్స్ పుత్రన్ దర్శకత్వం వహించిన ప్రేమమ్ చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తమిళం, తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా పాపులర్ అయిన అనుపమ.. ప్రస్తుతం తెలుగులో పరదా అనే చిత్రంలో నటిస్తుంది. అలాగే తమిళంలో మరిసెల్వరాజ్ దర్శకత్వంలో నటుడు ధ్రువ్ విక్రమ్ నటించిన బైసన్, అశ్వంత్ మరిముత్తు దర్శకత్వంలో నటుడు ప్రదీప్ రంగనాథన్ జోడిగా డ్రాగన్ అనే చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
ఈ క్రమంలోనే అనుపమ తన ఇన్ స్టాలో “నేను నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తాను అన్నది ప్రపంచంలోనే అతి పెద్ద అబద్ధం. ఎప్పుడూ అలసిపోయే ట్యాక్సీ ప్రేమను వదిలేసి అలాంటి ప్రేమకు దూరంగా పారిపో” అంటూ రాసుకొచ్చింది.తాను చాలా సంతోషంగా ఉన్నప్పుడు ప్రేమమ్ చిత్రంలో నటిస్తే అలువ పులాయుడా తీరత్తు అనే పాట వింటానని.. మనసు అలసిపోయినప్పుడు ప్రేమమ్ సినిమా చూస్తానని, అందులో తన తొలి సన్నివేశం చూసినప్పుడు మనసుకు ప్రశాంతత కలుగుతుందని అన్నారు. అలాగే ప్రేమమ్ సినిమాలో నటి సాయి పల్లవి తొలి సన్నివేశానికి తాను పెద్ద అభిమానిని అని అనుపమ పరమేశ్వరన్ తెలిపింది. దీంతో అనుపమ చేసిన పోస్ట్ పై విభిన్న కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..