Most Recent

Game Changer: గొప్ప మనసు చాటుకున్న ‘గేమ్ ఛేంజర్’ నిర్మాత.. ఏకంగా 5000 మందికి..

Game Changer: గొప్ప మనసు చాటుకున్న ‘గేమ్ ఛేంజర్’ నిర్మాత.. ఏకంగా 5000 మందికి..

రామ్‌చరణ్‌ హీరోగా నటించిన చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’.  క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కించగా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. అయితే గేమ్ ఛేంజర్ సినిమా తమిళ హక్కులను పొందిన ప్రముఖ నిర్మాత ఆదిత్యరామ్‌ అని అందరికి తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా నటించిన ‘ఏక్‌ నిరంజన్‌’ సినిమాకి నిర్మాతగా వ్యవహరించింది కూడా ఆదిత్యారామే. అయితే ఆదిత్యారామ్‌ తర్వాత కాలంలో రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకే కాకుండా పలు రకాలైన బిజినెస్‌లలోకి ఎంటరై తమిళనాడులో స్థిరపడ్డారు. తమిళనాడులో ఆదిత్యారామ్‌ ప్యాలెస్‌ అంటే ఫుల్‌ ఫేమస్‌. ఆయన ప్యాలెస్‌ నుండి ఎంతోమంది అవసరార్ధులకు వారికి కావాలసిన సాయాన్ని అందిస్తుంటారు. ఆదిత్యరామ్‌ అనగానే అమలాపురం అల్లునిగా ఒక తెలుగువాడుగా చెన్నైలో ఫుల్‌ ఫేమస్‌. ఈ ఏడాది సంక్రాంతి పండగకి ఆయన 5000 మందికి పైగా వారి ఇంటి అవసరాలకు కావలసిన నిత్యావసరాలను అందించారు. ఆయనద్వారా సాయం పొందినవారు ఎందుకు బాబు ఇవన్నీ మా కోసం చేస్తున్నావని అడగ్గా ఆదిత్యారామ్‌ ఇలా చెప్పుకొచ్చారు.

‘నేను చాలా చిన్న స్థాయి నుంచి ఈ స్థాయివరకు వచ్చాను. అవసరాలు ఎలా ఉంటాయో అవి అవసరమైన వారికే తెలుస్తాయి. నాకు మీ అవసరాలు తెలుసు. అందుకే నాకు చేతనైన సాయం వీలైనంతమందికి చేస్తుంటాను. ఈ పండక్కి దాదాపు 5000 మందికి పైగానే నిత్యావసరాలను అందించే చేసే అవకాశం దక్కింది. ఇలానే మీ ఆశీస్సులు ఉంటే వీలైనంత ఎక్కువమందికి అవసరమైన వారందరికి సాయం చేయాలని నా మనస్సు ఎప్పుడూ కోరుకుంటుంది’ అని ఆదిత్యా రామ్ తెలిపారు.

ఆదిత్యా రామ్ ప్యాలెస్ వద్ద జన సందోహం..

గతంలోనూ..

నిర్మాత దిల్ రాజుతో ఆదిత్యా రామ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.