Most Recent

Dil Raju : దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు.. ఇళ్లు, ఆఫీసుల్లో ఐటి అధికారుల సోదాలు

Dil Raju : దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు.. ఇళ్లు, ఆఫీసుల్లో ఐటి అధికారుల సోదాలు

టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు(వెంకటరమణ రెడ్డి) ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని దిల్ రాజు ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దిల్ రాజు ఇంటితో పాటు నగరంలో పలుచోట్ల ఐటీ అధికారుల తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు నగరవ్యాప్తంగా 65 బృందాలుగా దిల్ రాజుకు సంబందించిన ఎనిమిది ప్లేసుల్లో  IT సోదాలు జరుగుతున్నాయి. నిర్మాత దిల్ రాజు, కుటుంబసభ్యుల ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు అన్నింటిని అధికారులు సోదా చేస్తున్నారు. రీసెంట్ గా దిల్ రాజు రెండు సినిమాలను నిర్మించారు. శిరీష్ తో కలిసి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా గేమ్ ఛేంజర్, అలాగే వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను దిల్ రాజు నిర్మించారు. కాగా దిల్ రాజుతో పాటు శిరీష్ , దిల్ రాజు కూతురు హన్సిత రెడ్డి నివాసాలలో కూడా ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

టాలీవుడ్ లో బడా ప్రొడ్యూసర్ గా దిల్ రాజు రాణిస్తున్నారు. డిస్టిబ్యూటర్ నుంచి నిర్మాతగా ఎదిగారు దిల్ రాజు. దిల్ సినిమాతో ఆయన నిర్మాతగా మారడం అలాగే ఆ సినిమా మంచి విజయం స్ ; అందించడంతో ఆయన పేరు దిల్ రాజుగా మారిపోయింది. ఓ వైపు నిర్మాతగా రాణిస్తూనే మరో వైపు డిస్టిబ్యూటర్ గాను వ్యవహరిస్తున్నారు దిల్ రాజు. కాగా ఇటీవలే  దిల్ రాజుని ప్రభుత్వం తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ)కు చైర్మన్‌గా నియమించిన సంగతి తెలిసిందే.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.