-
గత రెండేళ్లుగా విక్రమ్, పొన్నియన్ సెల్వన్, జైలర్, లియో లాంటి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన కోలీవుడ్‌కు ఇప్పుడు బ్యాడ్ టైమ్ నడుస్తుంది. జైలర్, లియోలతో థియేటర్స్ హౌజ్ ఫుల్స్ అయ్యాయి.
-
ఆ తర్వాత ఆ రేంజ్ ఫీడింగ్ థియేటర్స్‌కు లేదు. సంక్రాంతికి ధనుష్ కెప్టెన్ మిల్లర్, శివకార్తికేయన్ అయలాన్ సినిమాలతో వచ్చినా కూడా ఏదో ఓకే అనిపించాయే తప్ప.. బ్లాక్‌బస్టర్స్ అయితే కాదు.
-
సమ్మర్‌కు వస్తాయనుకున్న సూర్య, విక్రమ్, అజిత్ సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. భారీ సినిమాలు వస్తాయని ఆశలు పెట్టుకున్న ఎగ్జిబిటర్లకు చావు కబురు చల్లగా చెప్పారు నిర్మాతలు.
-
అలాగే కమల్ హాసన్ ఇండియన్ 2 సైతం జులై 12న విడుదల కానుంది. అజిత్, విజయ్, రజినీకాంత్ సినిమాలు ఇంకా సెట్స్‌పైనే ఉన్నాయి. ఈ టైమ్‌లో ఫీడింగ్ లేక చాలా థియేటర్స్ మూసుకుంటున్నారు ఎగ్జిబిటర్లు.
-
తమిళంతో పోలిస్తే టాలీవుడ్ కాస్త బెటర్. మన దగ్గర కల్కి, పుష్ప 2, దేవర, గేమ్ ఛేంజర్, ఓజి అంటూ 2024లో రాబోయే పెద్ద సినిమాల పేర్లు చెప్తున్నాం. కానీ అక్కడ ఇండియన్ 2 తప్పిస్తే.. ఏ సినిమా కనిపించట్లేదు. కంగువా, తంగలాన్ ఇంకా డేట్ చెప్పలేదు. విజయ్ గోట్ మాత్రమే ఈ ఏడాది రానుంది. మొత్తానికి స్టార్స్ వచ్చేవరకు థియేటర్స్‌లో ఆడియన్స్ కంటే ఈగలు, దోమలే కనిపించేలా ఉన్నాయిప్పుడు అంటున్నారు ఎగ్జిబిటర్లు.