-
లవ్ స్టోరీలోని సారంగదరియా అనే పాట ఎప్పట్నుంచో తెలంగాణ పల్లెల్లో మార్మోగుతూనే ఉంది. దాన్నే తీసుకుని సినిమాలోని కథకు అనుగుణంగా రాసారు సుద్దాల అశోక్ తేజ.
-
అలాగే అల వైకుంఠపురములో రాములో రాములా పాట కూడా జానపదమే.. దీన్ని మోడ్రనైజ్ చేసి రాసారు లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్. ఈ సాంగ్ యూట్యూబ్ లో ఇప్పటికి ట్రేండింగ్ లో ఉంది.
-
ఆ మధ్య పలాస 1978లో వచ్చిన నాదీ నకిలీసు గొలుసు మూలం ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా అక్కడీ పాట ఫేమస్. ఈ సాంగ్ కూడా యూట్యూబ్ ను షాక్ చేసింది.
-
అలాగే బోనాల సమయంలో వచ్చే నువ్ పెద్ద పులినెక్కినావమ్మో పాటని ఛల్ మోహన్ రంగా సినిమాలో నితిన్‌తో రీమిక్స్ చేసారు థమన్. ఇక మగధీరలో ఏం పిల్లో ఎల్దమొస్తవా ట్యూన్ హిట్ అవ్వడంతో పాటు.. వివాదమూ అయింది.
-
ఈ ఫోక్ సాంగ్స్‌పై ఫోకస్ చేయడంలో పవన్ అందరికంటే ముందుంటారు. తమ్ముడులో తాటిచెట్టెక్కలేవు నుంచి ఖుషీలో బైబైయ్యే బంగారు రమనమ్మా, జానీలో నువ్వూ సారా తాగుడు మాను లింగం, అత్తారింటికి దారేదిలో కాటమరాయుడా వరకు ఎన్నో ప్రైవేట్ సాంగ్స్ తన సినిమాలతో మరింత ఫేమస్ అయ్యేలా చేసారు పవర్ స్టార్. మొత్తానికి ఇదే ఇప్పుడు ట్రెండ్.. అందుకే అంతా అలా ఫాలో అయిపోతున్నారు.