Most Recent

Tollywood: ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? యాక్టర్ మాత్రమే కాదు డాక్టర్ కూడా.. అలాంటి అమ్మాయిలకు అండగా..

Tollywood: ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? యాక్టర్ మాత్రమే కాదు డాక్టర్ కూడా.. అలాంటి అమ్మాయిలకు అండగా..

సినీ పరిశ్రమలో ఎంతోమంది డాక్టర్స్ నటీనటులుగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. కొందరు డాక్టర్ చదువులను మధ్యలో ఆపేసి ఇండస్ట్రీలో కొనసాగుతుండగా.. మరికొందరు అటు వైద్యులుగా విధులు నిర్వహిస్తూ.. ఇటు తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. డాక్టర్ రాజశేఖర్, సాయి పల్లవి డాక్టర్స్ కాగా.. హీరోయిన్ శ్రీలీల మెడిసిన్ చదువుతుంది. కానీ ఇప్పుడు ఓ హీరోయిన్ కూడా డాక్టర్ అని తెలుస్తోంది. ఇన్నాళ్లు కేవలం నటిగానే ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. అందులో మానసిక వైకల్యం ఉన్న అమ్మాయిలకు తనవంతు సాయం చేస్తుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరా అని ఆలోచిస్తున్నారా.. ? పైన ఫోటోను చూశారా.. ఆ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..? ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంటున్న హీరోయిన్ రూప కొడువాయూర్. అచ్చ తెలుగమ్మాయి.

టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు వచ్చినా.. రూపకు అంతగా గుర్తింపు రాలేదు. ఈ సినిమా తర్వాత బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ నటించిన మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి రివ్యూస్ అందుకున్న సంగతి తెలిసిందే. మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాతో రూపకు మంచి గుర్తింపు వచ్చింది. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ ఆఫర్స్ అందుకుంటుంది రూప. ప్రస్తుతం తమిళంలో నీలిరా సినిమాలో నటిస్తుంది. అలాగే ప్రస్తుతం తెలుగులో యంగ్ హీరో ప్రియదర్శి జోడిగా కొత్త ప్రాజెక్టులో నటిస్తుంది.

ఇదిలా ఉంటే.. రూప కొడువాయూర్ నటి మాత్రమే కాకుండా డాక్టర్ కూడా. అలాగే డ్యాన్సర్ కూడా. డాక్టర్ గా తన వృత్తిని కొనసాగిస్తూనే ఇటు కథానాయికగా సినిమాల్లో నటిస్తుంది. అలాగే వైద్యురాలిగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. తాజాగా ఓ ఊరికి వెళ్లి అక్కడ మానసిక వైకల్యం ఉన్న అమ్మాయిలకు.. అలాగే వారి తల్లిదండ్రులకు పీరియడ్స్ పై అవగాహన కల్పిస్తుంది. అంతేకాకుండా ఉచితంగా శానిటరీ నాప్ కిన్స్ అందించింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుండగా.. రూప మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్.

 

View this post on Instagram

 

A post shared by Roopa Koduvayur (@roopakoduvayur_9)

 

View this post on Instagram

 

A post shared by Roopa Koduvayur (@roopakoduvayur_9)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.