బిగ్బాస్ సీజన్ 17 విన్నర్ మునావర్ ఫరూఖీ కొద్దిరోజులుగా నిత్యం వార్తలలో నిలుస్తున్నారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరినట్లు ఓ న్యూస్ నెట్టింట వైరలయ్యింది. హాస్పిటల్ బెడ్ పై దీనస్థితిలో ఉన్న మునావర్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఇదిలా ఉంటే ఇటీవలే మునావర్ రెండో వివాహం చేసుకున్నాడు. మేకప్ ఆర్టిస్ట్ మెహజబీన్ కోట్వాలాతో కలిసి మరోసారి వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో పది రోజుల క్రితం వీరిద్దరి వివాహం జరిగింది. ఈ జంట ఆదివారం ఐటీసీ మరాఠాలో వివాహ విందును ఏర్పాటు చేశారు. ఇక తాజాగా రెండో భార్య మెహజబీన్తో కలిసి మొదటిసారి కెమెరా ముందుకు వచ్చారు.
తన భార్యతో కలిసి కేక్ కట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మునావర్ రెండో పెళ్లి విషయాన్ని చాలా సీక్రెట్ గా ఉంచారు. అయితే అప్పటికే వీరి వివాహం గురించి నెట్టింట ప్రచారం జరిగింది. అలాగే వీరి వివాహ ఆహ్వాన పత్రిక కూడా నెట్టింట చక్కర్లు కొట్టింది. మునావర్ రెండో భార్య మెహజబీన్ మెమన్ కమ్యూనిటీకి చెందిన మహిళ. వీరు దక్షిణ ముంబైలోని అగ్రిపాద ప్రాంతంలో నివసిస్తున్నారు. అయితే వీరిది ప్రేమ వివాహమా.. లేదా పెద్దలు కుదిర్చిన పెళ్లా అనేది తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. మునవార్ కు గతంలోనే వివాహం జరిగింది. మొదటి భార్యతో ఓ కుమారుడు ఉన్నాడు. అలాగే ఇప్పుడు రెండో భార్య మెహజబీన్ కు 10 ఏళ్ల కుమార్తె ఉన్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 17లో మునావర్ ఆట తీరుతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. అంతకు ముందు స్టాండప్ కమెడియన్ గా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.