Most Recent

Vijay Deverakonda: విజయ్ దేవరకొండను కలిసిన ప్రశాంత్ నీల్.. అసలు మ్యాటర్ ఇదే..

Vijay Deverakonda: విజయ్ దేవరకొండను కలిసిన ప్రశాంత్ నీల్.. అసలు మ్యాటర్ ఇదే..

ఖుషి విజయం తర్వాత విజయ్ దేవరకొండ నటించిన సినిమా ఫ్యామిలీ స్టార్. గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడితో మళ్లీ చేతులు కలిపాడు రౌడీ హీరో. డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. విడుదలకు ముందే టీజర్, ట్రైలర్ తో పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీకి రిలీజ్ రోజే కొన్ని మిక్స్డ్ రివ్యూస్ రావడంతో వసూళ్లపై ప్రభావం చూపించింది. కానీ మరోసారి తనదైన నటనతో ప్రేక్షకులను అలరించాడు విజయ్. ఇందులో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించింది. ఇక ఫ్యామిలీ స్టార్ తర్వాత తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై మరింత ఫోకస్ పెట్టాడు విజయ్. నెక్ట్స్ సెలక్ట్ చేసుకునే సినిమాల విషయంలో భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే.. నిన్న విజయ్ దేవరకొండను పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలుసుకున్నారు. విజయ్ దేవరకొండ ఇంటికి ప్రశాంత్ నీల్ అతిథిగా వెళ్లారని సమాచారం. విజయ్ దేవరకొండ మేనేజర్ తో ప్రశాంత్ నీల్ ఉన్న ఫోటో నెట్టింట వైరలవుతుంది. అయితే వీరి మీటింగ్ పై ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే ప్రస్తుతం విజయ్ మేనేజర్ ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ రాబోతుందంటూ ప్రచారం నడుస్తోంది.

అయితే ప్రస్తుతం సలార్ 2 ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్.. ఒక ముఖ్యమైన పని మీద హైదరాబాద్ వచ్చిన ప్రశాంత్.. ఆ సందర్బంలో కలిసారని సమాచారం. దీంతో వీరిద్దరి మధ్య మూవీ రాబోతుందంటూ టాక్ నడిచింది. అయితే ఆ వార్తల్లో నిజం లేదని.. వారిద్దరి కలయిక సాధారణంగానే జరిగిందని విజయ్ టీమ్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతేడాది సలార్ సినిమాతో ప్రభాస్ ఖాతాలో బ్లాక్ బస్టర్ అందించిన నీల్.. ఇప్పుడు సెకండ్ పార్ట్ స్టార్ట్ చేసే పనిలో ఉన్నట్లు సమాచారం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.