టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడున్న టాప్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ లో నాగ్ అశ్విన్ ఒకరు. 2015లో ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో దర్శకుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన నాగ్.. ఆ తర్వాత మహానటి సినిమాతో వెండితెరపై మ్యాజిక్ చేశాడు. దివంగత నటి సావిత్ర జీవిత కథగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో కల్కి 2898ఏడి సినిమాను తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ స్థాయిలో భారీ బడ్జెట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈసినిమాలో బాలీవుడ్ తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటాని ముఖ్య పాత్రలు పోషిస్తుండగా.. లోకనాయకుడు కమల్ హాసన్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ చిత్రాన్ని అడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రయూనిట్ ట్రై చేస్తుంది. ఇప్పటికే ఈ మూవీ స్టోరీ లైన్ డైరెక్టర్ నాగ్ రివీల్ చేయడంతో అంచనాలు మరింత పెరిగాయి.
ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. మే 5న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు మేకర్స్. కానీ ఎలక్షన్స్ కారణంగా ఈ ప్రాజెక్ట్ రిలీజ్ వాయిదా పడనుందని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు కల్కి షూటింగ్ సెట్ లో చిత్రయూనిట్ ఎంజాయ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వినిపిస్తుంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ బర్త్ డే సెలబ్రేషన్లను కల్కి సెట్ లో నిర్వహించింది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే నాగార్జున నటించిన మాస్ సినిమాలోని టైటిల్ సాంగ్ ప్లే చేస్తూ నాగ్ అశ్విన్ తో కలిసి డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు టీం మెంబర్స్. అందులో మాస్ టైటిల్ పాటకు నాగ్ డాన్స్ అదరగొట్టేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది.
నాగ్ డాన్స్ వీడియోపై నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్ కాదు.. డాన్స్ కూడా అదరగొట్టేస్తున్నాడని.. నాగ్ లో ఈ టాలెంట్ కూడా ఉందా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. నాగ్ అశ్విన్ కు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలిపారు ప్రభాస్. అద్భుతమైన దర్శకుడు నాగ్ అశ్విన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. కల్కి విషయంలో నీ విజన్ నాకు స్పూర్తిని ఇస్తుంది అంటూ రాసుకొచ్చారు.
#Prabhas #Kalki2898AD director NagAshwin Birthday Celebrations !! pic.twitter.com/5lRzTTlFAQ
— Pradeep (@Pradeepreddy___) April 24, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.