ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. అప్పూని గెస్ట్ హౌస్‌కు రమ్మన్న బ్రోకర్‌ను అందరిలో పట్టుకుని కొడతాడు కళ్యాణ్. అప్పూని పోలీస్ ట్రైనింగ్ కాకుండా అడ్డుకుంటున్నట్లు చెప్తాడు. ఇలాంటి వాళ్ల వల్లే ముందుకు వస్తున్న అమ్మాయిలు.. భయంతో వెనకబడిపోతున్నారని కళ్యాణ్ అంటే.. మరి పోలీసులకు చెప్పొచ్చు కదా సర్.. మీరే ఎందుకు కొడుతున్నారని మీడియా అడుగుతుంది. సాక్ష్యాలు లేవని.. ఎవరూ ఏమీ చేయలేరని పొగరు అని కళ్యాణ్ అంటాడు. ఏమ్మా ఇది నిజమా.. ఇతను నిన్ను ఇబ్బంది పెట్టాడా అని అక్కడున్న పోలీస్ అడుగుతాడు. ఇబ్బంది పెట్టాడు కాబట్టే.. ముందుకు వచ్చి చెప్తున్నా. ఇంకా చాలా మంది అమ్మాయిలు వీడి వల్ల ఎంత నరకం అనుభవించారో.. ఇలాంటి పరిస్థితి మరో అమ్మాయికి రాకూడదని నేను ముందుకు వచ్చాను అని అప్పూ అంటుంది. సరే అమ్మా నేను యాక్షన్ తీసుకుంటా అని పోలీస్ చెప్తాడు. ప్రతీ అమ్మాయికి మీ లాంటి వారు అండగా ఉంటే.. ఈ సమాజంలో ఏ సమస్యలూ రావు సర్ అని మీడియా అంటే.. మేము రావాల్సిన అవసరం లేదు. ఎటువంటి భయాలూ లేకుండా ఆడవాళ్లు తిరే సమాజం రావాలని అనుకుంటున్నా అని కళ్యాణ్ అంటాడు.
చిచ్చు రాజేసిన రుద్రాణి..
ఇక్కడ జరిగిన సీనంతా ఫోన్‌లో చూస్తుంది రుద్రాణి. అది చూసి.. వెంటనే ధాన్య లక్ష్మి దగ్గరకు వెళ్లి చెప్తుంది. అప్పటి ధాన్య లక్ష్మి పాటలు వింటూ ఉంటుంది. కళ్యాణ్ వీధుల్లో గొడవలు పడుతున్నాడు చూడు అని ధాన్యంకు రుద్రాణి వీడియో చూపిస్తుంది. అది చూసి ధాన్య లక్ష్మి షాక్ అవుతుంది. వీడికి ఎంత చెప్పినా బుద్ధి లేదని అంటుంది. వాడిని అని ఎంత ప్రయోజనం చెప్పు? ఆ అప్పూ వల్లనే అలా రోడ్డు మీద గొడవలు పడుతున్నాడని రుద్రాణి అంటుంది. దానికి ఎన్ని సార్లు చెప్పినా సిగ్గు లేకుండా నా కొడుకుతో తిరుగుతుందని అప్పూని తిడుతుంది ధాన్య లక్ష్మి. మరింకెందుకు లేట్.. వెళ్లి ఆ కనకం ఇంటి దగ్గర రచ్చ చేయ్ అని రుద్రాణి అంటే.. అక్కడికి వెళ్లాల్సిన ఖర్మ నాకెందుకు? వాళ్లనే ఇక్కడికి రప్పిస్తా అని ధాన్య లక్ష్మి అంటుంది. ఆ తర్వాత కనకానికి ఫోన్ చేసి.. ఇంటికి రమ్మంటుంది. వెంటనే కనకం అప్పూకి ఫోన్ చేసి.. ధాన్య లక్ష్మి గురించి చెప్తుంది. సరే అక్కడే చూసుకుందాం నువ్వు వచ్చేయ్ అని అప్పూ అంటుంది.
రెచ్చిపోయిన ధాన్య లక్ష్మి..
ఇక కింద హాలులోకి దిగిన ధాన్య లక్ష్మి రచ్చ స్టార్ట్ చేస్తుంది. ఒక్కసారి కాదు.. రెండు సార్లు కాదు.. అయినా సరే నా మాట లెక్క చేయకుండా నా కొడుకుతో తిరుగుతూనే ఉంటుంది. ఇవాళ తిరగడం మాత్రమే కాదు.. వీధి రౌడీని చేసింది. ఈ వార్త న్యూస్ ఛానెల్‌లో కూడా వచ్చిందని అంటుంది. అప్పుడే కనకం, కృష్ణ మూర్తి వస్తారు. వాళ్లను చూసి మరింత రెచ్చి పోతుంది ధాన్య లక్ష్మి. ఏం జరిగిందని కనకం అడిగితే.. మీకు నిజమేంటో తెలీదా అని ధాన్య లక్ష్మి అడుగుతుంది. అప్పుడు ఫోన్‌లో వీడియో చూపిస్తుంది. ఇంత గొడవ జరిగిందా మాకు తెలీదని కనకం వాళ్లు అంటారు. ఇంకా ఎందుకు నాటకాలు ఆడతారు? అని రుద్రాణి అంటే.. ఫైటింగ్ చేసి వచ్చింది మీ కొడుకా అని స్వప్న అంటే.. కాదని రుద్రాణి అంటుంది. అయితే మూసుకుని నిలబడమని స్పప్న అంటుంది.
ధాన్యలక్ష్మికి కౌంటర్..
ఇదంతా కాదు.. ఎన్ని సార్లు చెప్పినా.. మీ కూతురు ఎందుకు నా కొడుకుతో ఇంత భరితెగించి తిరుగుతుంది? దానికి ఏమీ సిగ్గూ, ఎగ్గూ లేదా.. ఇంటికి వచ్చి మరీ వార్నింగ్ ఇచ్చాను కదా.. అని ధాన్య లక్ష్మి అంటే.. కొంచెం సంస్కారంతో మాట్లాడండి కావ్య అంటుంది. సంస్కారం అంటే ఏంటో తెలిసిన వాళ్లకు నేర్పనక్కర్లేదు. మీకు లేదు కాబట్టి నేర్చుకోండి. అసలు ఏం జరిగిందో తెలీకుండా ఎంగిలి విస్తరాకులా ఎగిరెగిరి పడుతున్నారేంటి? అని స్వప్న నిలదీస్తుంది. అంతలో కళ్యాణ్ వచ్చి నేను చెప్తాను అని అంటాడు. అప్పూ ఉద్యోగం కోసం వెళ్తే.. ఎవరో మిస్ బిహేవ్ చేశారని తెలిసి వెళ్లి కొట్టాను అది తప్పా? అని కళ్యాణ్ అంటే.. తప్పే ఆడపిల్లను అల్లరి పెడితే వెళ్లి పోలీసులకు అప్పజెప్పాలి కానీ నువ్వు వెళ్లి వీధి రౌడీలా గొడవ పడతావా? మన పరువు పోదా? అని అపర్ణ అంటుంది.
రాజ్‌లానే కళ్యాణ్ కూడా బిడ్డను తీసుకొస్తాడేమో..
సిగ్గు లేకుండా నా భర్తతో తిరుగుతూ పైగా వెనకేసుకొస్తున్నావా? అని అనామిక అంటే.. ఫ్రెండ్ ఫ్రెండ్‌తో తిరిగితే సిగ్గెందుకు? బొగ్గెందుకు? అని అప్పూ అంటుంది. మీ ఇద్దరి జరిగే బాగోతానికి ఫ్రెండ్‌షిప్ అని పేరు పెడుతుందని అనామిక అంటే.. షటప్ ఇంకోసారి తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదని కళ్యాణ్ అంటాడు. నోర్ముయ్ ఎవరి కోసమే నీ భార్యను అవమానిస్తావా? ఈ అప్పూ వల్లే నువ్వు చెడిపోతున్నావ్.. అని ధాన్య లక్ష్మి అంటుంది. ఏమో రేపటి రోజున రాజ్‌లానే.. కళ్యాణ్ కూడా ఓ బిడ్డను తీసుకొస్తాడేమో అని రుద్రాణి అంటే.. పళ్లు రాళ్లతాయ్ అని స్వప్న అంటుంది. ఏంటి అని రుద్రాణి కోపంగా చూస్తుంది. అదే నా చెల్లెలు అలాంటి తప్పు చేస్తే పళ్లు రాళ్లతాయ్ అని స్వప్న అంటుంది.
తడాఖా చూపించిన కనకం.. మనసుల్ని పిండేసే సీన్..
ఇకపై ఇలా జరగకూడదు అంటే.. కనకం కుటుంబానికి.. ఈ ఇంటికి తెగదెంపులు అయిపోవాలి. శాశ్వతంగా సంబంధాలు తెంచుకోవాలి అని చెబుతుంది. ఎవరు? ఏ గడప? మీ గడప లోపల మా ఇద్దరి కూతుళ్లు ఉన్నారు? వాళ్ల మాటఏంటి? ఏంటి ఆర్డర్ వేస్తున్నావ్? శాశ్వతంగా సంబంధం తెంచుకోవాలా? ఖచ్చితంగా వస్తాను.. ఓ కూతురు కష్టంలో ఉంది. మరో కూతురు కడుపుతో ఉంది. యోగక్షేమాలు కనుక్కోవడానికి ఖచ్చితంగా వస్తాను. ఆపడానికి నువ్వెవరు? నువ్వేదో రాజమాతవు అయినట్టు రాజ శాసనాలు జారీ చేస్తున్నావేంటి? ఆ రోజులు పోయాయ్. ఆ తర్వాత పెద్ద వాళ్ల దగ్గరకు వెళ్లిన కనకం.. క్షమించండి నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది. ఒక అల్లుడేమో అత్తవారింట గడప తొక్కలేదు. మరో అల్లుడు ఒక కొడుకును తీసుకొచ్చి.. నా కూతురు జీవితాన్ని చీకట్లోకి తోశాడు. ఈ కళ్యాణ్ బాబు.. ఎవరి మాట వినకుండా అప్పూతో స్నేహం చేస్తూ.. మాకు ఈ తలవంపులు తెచ్చి పెడుతున్నాడు. ఇందులో మేము చేసిన తప్పేంటి? మేము ఎందుకు రాకూడదు? అడిగే హక్కు మాకు లేదా? అని కనకం అడిగితే.. ఉంది.. ఈ ఇంటికి రావద్దని చెప్పే హక్కు ఎవరికీ లేదని సీతా రామయ్య అంటాడు. ధాన్య లక్ష్మి ఇప్పటికైనా మీ పరువు నిలబెట్టుకో అని పెద్దావిడ అంటుంది. కళ్యాణ్ బాబూ.. ఇంకోసారి మీ భార్య నా చిన్న కూతురు గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం.. మీ మొహం కూడా చూడను. జన్మలో దారి పేరు ఎత్తాలంటే భయపడేలా చేస్తాను అని కనకం అంటే.. నా ఫుల్ సపోర్ట్ మీకే ఆంటీ అని కళ్యాణ్ అంటాడు.
వెన్నెల కోసం.. కావ్య వేట..
ఈ సీన్ కట్ చేస్తే.. కావ్య పక్కన నిల్చుని బాధ పడుతూ ఉంటుంది. అప్పుడే వచ్చిన ఇందిరా దేవి.. ఏంటి అప్పూ విషయం ఆలోచిస్తున్నావా? అని అడుగుతుంది. నా చెల్లి తప్పు చేయదు.. అమ్మమ్మగారూ పైగా కళ్యాణ్ కూడా సపోర్ట్‌గా ఉన్నాడు. ఇందులో నేను బాధ పడటానికి ఏమీ లేదని కావ్య అంటే.. మరి వెళ్లిన విషయం ఏమైంది? స్కూల్‌కి వెళ్లావా? అడ్రెస్ దొరికిందా? అని పెద్దావిడ అడుగుతుంది. ఆ అడ్రెస్ పట్టుకుని ఇంటికి కూడా వెళ్లాను అని కావ్య అంటే.. ఏమైంది? వెన్నెల ఎవరో తెలిసిందా అని ఇందిరా దేవి అడుగుతుంది. ఆమె పదేళ్ల క్రితమే ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయిందట. అంతలోనే కళ్యాణ్ వచ్చి నేను సపోర్ట్ చేస్తానంటే.. కావ్య వద్దు అని చెబుతుంది. ఇక ఇవాళ్టితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.