కాస్టింగ్ కౌచ్ పై ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన విషయం తెలిసిందే. తాజా కెరీర్ లో ఎదురైన చేదు అనుభవాలను కూడా పంచుకున్నారు. తాజాగా ప్రముఖ బుల్లితెర నటి కృష్ణ ముఖర్జీకూడా తనకు ఎదురైన చేదు అనుభవంగా గురించి మాట్లాడింది. హిందీ టీవీ నటి కృష్ణ ముఖర్జీ నిర్మాతతో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది. ‘యే హై మొహబ్బతే’ అనే సీరియల్తో ఫేమస్ అయిన ఆమె మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. అయితే ఓ సీరియల్ సమయంలో ఆమెను ఓ నిర్మాత వేధించాడని తెలిపింది.
కృష్ణ ముఖర్జీ ప్రస్తుతం ‘శుభ షగుణ్’ అనే సీరియల్లో నటిస్తుంది.అయితే ఉన్నట్టుండి ఆమె ఈ సీరియల్ నుంచి తప్పుకుంది. సీరియల్ నిర్మాత కుందన్ సింగ్ ఇచ్చిన వేధింపులే ఇందుకు కారణం. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు ‘ఇది రాసేటప్పుడు నా చేతులు వణుకుతున్నాయి. అయినా నేను రాయాలి. వాటి వల్ల నేను డిప్రెషన్లోకి వెళ్ళాను. మేము మా భావోద్వేగాలను ఆపుకుంటున్నాం, సోషల్ మీడియాలో మా మంచి జీవితాన్ని మాత్రమే చూపిస్తాము. కానీ వాస్తవం వేరే ఉంటుంది’ అని రాసుకొచ్చింది.
నేను మరింత బాధపడతానని దీని గురించి పోస్ట్ చేయవద్దని కుటుంబ సభ్యులు నాకు చెప్పారు. నేనెందుకు భయపడాలి? న్యాయం కోరడం నా హక్కు’ అని నిర్మాత కుందన్ సింగ్ ను ట్యాగ్ చేసింది. దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. గత ఏడాదిన్నర నాకు అంత సజావుగా సాగలేదు. నేను డిప్రెషన్లో ఉన్నాను. నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తున్నాను. దంగల్ టీవీకి శుభ్ షాగున్ సీరియల్ అంగీకరించినప్పటి నుంచి ఈ సమస్య ఉంది. ఆ సీరియల్ ఒప్పుకోవడం తన జీవితంలో చెత్త నిర్ణయం అని.. ఒకరి మాటలు విని ఒప్పందంపై సంతకం చేశానని రాసుకొచ్చింది. ‘‘ప్రొడక్షన్ హౌస్, నిర్మాత కుందన్ సింగ్ తనను వేధించాడని. బట్టలు మార్చుకునేటప్పుడు తలుపు కొట్టాడని, తనను చాలాసార్లు బెదిరించాడని నటి ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే తనకు ఆ సీరియల్ లో నటించినందుకు రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదని తెలిపింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.