ఈ రోజు బ్రహ్ముముడి సీరియస్‌లో.. కోడలిని వెనకేసుకొచ్చినందుకు అనుభవించు. నిన్ను నేను కట్టుకున్నందుకు… వాడు ఈ పిల్లను కట్టుకున్నందుకు జీవితాంతం అనుభవిస్తాం అని ప్రకాశం ధాన్యలక్ష్మిని తిడుతాడు. ఇన్నాళ్లూ నా కోడలూ నా కోడలూ అని నెత్తిన పెట్టుకున్నావ్. చివరికి కళ్యాణ్‌కి ఎలాంటి పరిస్థితి తెచ్చిపెట్టిందో చూశావా అని అపర్ణ కూడా అంటుంది. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. కళ్యాణ్ ఆ అప్పూతో తిరుగుతుంటే ఎవరూ ఎందుకు ఆపలేక పోయారు అని అనామిక అంటుంది. ఏయ్ ఎడ్డి ముఖం దానా.. అప్పూ గురించి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడితే.. నీ నాలుక కోసేస్తాను ఏమం అనుకుంటున్నావో.. అప్పూ కనుక కళ్యాణ్‌ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే.. నువ్వే కాదే.. నీ బాబు దిగి వచ్చినా సరే కళ్యాణ్‌ని ఎగరేసుకుపోయేది. ఇంట్లో ఇక్కడ మేము ఉన్నాం కాబట్టి నువ్వేం అన్నా భరిస్తుంది. లేదంటే నల్లిని నలిపినట్టు నలిపేస్తుంది జాగ్రత్త అని స్వప్న వార్నింగ్ ఇస్తుంది.
అనామికకు గడ్డి పెట్టిన అత్త..
చాలు ఇక ఆపు.. నీ చెల్లెని అదుపులో పెట్టుకోవడం చేత కాదు కానీ.. రౌడీలా మాట్లాడుతున్నావ్. ఎవరో దారిన పోయే దానికి భయపడి.. నా కొడుకు మీద కేసు పెడతావా? ఇది నీకు న్యాయంగా ఉందా? నీకు నేనేం తక్కువ చేశాను. చివరికి ఇదేనా నాకు ఇచ్చే గౌరవం అని ధాన్య లక్ష్మి నిలదీస్తుంది. నన్నేం చేయమంటారు అత్తయ్యా.. ఈ కావ్య అక్కలా అని అనామిక అనబోతుండగా.. హేయ్ నోర్ముయ్.. కావ్య గురించి మాట్లాడితే ఇప్పుడు ముఖం పగలకొడతా.. అది పిచ్చిదై ఓపిక పట్టడం లేదే.. కాపురం నిలబెట్టుకోవడానికి కష్ట పడుతుంది. ఇంత జరిగినా సరే నీలాగా పోలీస్ కేసు పెట్టిందా? దాని గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఇంకొక్క సారి దాని గురించి మాట్లాడితే.. నిన్నూ.. నీకు సపోర్ట్ చేసేవాళ్లను కుర్చీ మడత పెట్టి అని తిట్టబోతుండగా.. కావ్య ఆపి తీసుకెళ్తుంది. ఆ తర్వాత కోడలికి గడ్డి పెడుతుంది. ఇంత దారుణంగా వాడిని అవమానిస్తావా అని ధాన్యం తిడుతుంది.
పోలీస్ స్టేషన్‌కు కావ్య, రాజ్‌లు..
ఈ సీన్ కట్ చేస్తే.. కళ్యాణ్, అప్పూలు స్టేషన్‌లో ఉంటారు. సారీ అప్పూ నా గురించి నువ్వు పోలీస్ స్టేషన్‌కు రావాల్సి వచ్చిందని కళ్యాణ్ అంటే.. భార్యపై చేయి చేసుకోవడం తప్పే కదరా భయ్ అని అప్పూ అంటుంది. నీ క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడితే ఏం చేయమంటావ్ చెప్పు అని కళ్యాణ్ అంటాడు. అరే అది నా ప్రాబ్లమ్ కదా.. నేనేంటో నాకు తెలుసు. నువ్వేంటో నీకు తెలుసు. ఎవరు ఏం అనుకుంటే మనకేంది? అని అప్పూ అంటుంది. ఈ కేసు పెట్టడం వల్ల నీ పోలీస్ జాబ్ ఏం అవుతుంది? నీ ఫ్యూచర్ ఏంటి? అని కళ్యాణ్ అంటాడు. అప్పుడే రాజ్, కావ్యలు వస్తారు. ఇన్స్ స్పెక్టర్ దగ్గరకు వస్తారు. సారీ సర్ నేను ఆ అమ్మాయికి నచ్చ జెప్పడానికి ట్రై చేశాను. అయినా వినలేదని ఇన్స్ స్పెక్టర్ అంటాడు. నేను ఇప్పుడు చేయాలి? ఏం చేస్తే వాళ్లిద్దరూ కేసు లేకుండా బయటకు వస్తారు? మినిస్టర్‌తో మాట్లాడమంటారా? అని రాజ్ అడుగుతాడు. సారీ సర్ ఆ అమ్మాయి పెట్టింది మామూలు కేసు కాదు. డౌరీ హ్యారాస్ మెంట్‌తో పాటు, డెమెస్టిక్ వైలెన్స్ కేసు కూడా పెట్టింది. ఈ కేసులు స్ట్రాంగ్‌గా ఉన్నాయి. రేపు వీళ్లను కోర్టులో హాజరు పరచాలి అని పోలీసు అంటాడు.
రాజ్‌కు ఇన్స్ స్పెక్టర్ సలహా..
ఇన్స్ స్పెక్టర్ గారూ ఈ కేసు కోర్టు దాకా వెళ్తే.. దుగ్గిరాల ఇంటి పరువు పోతుంది. మీరే ఎలాగైనా ఏదో ఒకటి చేయాలి అని రాజ్ అంటాడు. ఇప్పుడు ఇదే ఒక్క అవకాశం ఉంది. మీ ఫ్యామిలీ మీద ఉన్న రెస్పెక్ట్ మీద చేప్తున్నా. ఇంకా నేను ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేయలేదు. మీరు ఎలాగైనా అనామికను ఒప్పించి.. కేసు విత్ డ్రా చేసుకునేలా చేయండి అని ఇన్స్ స్పెక్టర్ చెప్తాడు. అనామిక ఎవరు చెప్తే కేసు విత్ డ్రా చేసుకుంటుందో నాకు బాగా తెలుసు. చెప్తాను.. అని కావ్య అంటుంది.
దుగ్గిరాల ఇంట్లో కనకం విశ్వ రూపం..
ఈ సీన్ కట్ చేస్తే.. దుగ్గిరాల ఇంటికి కనకం వస్తుంది. రాగానే పూల కుండీ పగలకొడుతుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. అనామికను చూసి రావే.. పై నుంచి కిందకు దిగిరా.. అని పిలుస్తుంది. దుగ్గిరాల ఇంట్లో నానా బీభత్సం సృష్టిస్తుంది. అందరినీ తన మాటలతో ఏకిపారేస్తుంది. కళ్యాణ్‌కు కవితలు రాసి.. వల వేసి పెళ్లి చేసుకున్నావ్. ఎలాగో దుగ్గిరాల కుటుంబం కాబట్టి.. నీ తండ్రి కూడా ఊరిమీద వదిలేశాడు. నీలా నా కూతుర్ని వదల లేదు. నా కూతురు అప్పూ మీద కేసు పెట్టడానికి నీకు ఎంత ధైర్యం. నాకు న్యాయం కావాలి. నా బిడ్డ మీద కేసు లేకుండా ఇంటికి వచ్చేంత వరకూ నేను ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్లేది లేదు. ఇక్కడే నట్టింట్లో కూర్చొంటాను. అని మెట్ల మీద కూర్చొంటుంది. కనకం దెబ్బకు దుగ్గిరాల ఇంట్లో వారంతా హడలిపోతారు. ఇక ఇవాళ్టితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్‌తో మళ్లీ కలుద్దాం.
కమింగ్ అప్‌లో.. కావ్యకు తెలిసిపోయిన నిజం..
ఇక కమింగ్ అప్‌లో కావ్య బయటకు వస్తుంది. అప్పుడు డ్రైవర్ రాజ్ కారు క్లీన్ చేస్తాడు. అప్పుడే కావ్కకు ఒక బొకే కనిపిస్తుంది. దాని చూసి కావ్య షాక్ అవుతుంది. దాని మీద మైడియర్ కళావతి.. ‘హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ’ అని అంటుంది. అంటే ఇది మా పెళ్లి రోజుది. ఇది నాకు ఇవ్వడానికే కొన్న బొకే.. అయితే ఆయన నాకోసమే వచ్చారు. వచ్చే దారిలో మధ్యలో ఏదో జరిగింది. వెంటనే కావ్య లోపలికి పరిగెత్తుకెళ్తుంది.