Most Recent

Upasana Konidela: క్లింకారను మాకెప్పుడు చూపిస్తారు.. ఉపాసన పోస్ట్ పై నెటిజన్స్ రియాక్షన్..

Upasana Konidela: క్లింకారను మాకెప్పుడు చూపిస్తారు.. ఉపాసన పోస్ట్ పై నెటిజన్స్ రియాక్షన్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బిజినెస్ ఉమెన్‏గా.. అపోలో హాస్పిటల్స్ వైస్ ప్రెసిడెంట్‏గా ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఓవైపు రామ్ చరణ్ సినిమాలతో బిజీగా ఉంటే.. ఇటు ఉపాసన కూడా బిజినెస్ కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఇటీవలే తన అత్తయ్య.. రామ్ చరణ్ మదర్ సురేఖతో కలిసి అత్తమ్మ కిచెన్ పేరుతో ఫుడ్ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టారు. ఇక సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ బిజినెస్, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలతోపాటు ఫ్యామిలీ ఫోటోస్, వీడియోస్ అభిమానులతో పంచుకుంటారు ఉపాసన. ఇక తన క్లింకార ముఖాన్ని కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తుంటారు. అయితే తాజాగా తన కూతురు క్లింకారతో కలిసి హైదరాబాద్‏లో జరిగిన మెడిటేషన్ కు సంబంధించిన గ్లోబల్ స్పిర్చువాలిటీ మహోత్సవ్ కార్యక్రమానికి హాజరయ్యారు ఉపాసన.

ఈ కార్యక్రమంలో తన కూతురు క్లింకారతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని.. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కమలేష్ దాజిని కలిశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇన్ స్టాలో షేర్ ఎంతో ఆనందంగా ఉందంటూ చెప్పుకొచ్చింది. “ఈరోజు ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న గ్లోబల్ స్పిర్చువాలిటీ మహోత్సవ్ లో గౌరవనీయులైన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముజీ గారిని నా కుమార్తె క్లింకార కొణిదెలతో కలిసి కలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు..ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కామేష్ దాజి గారికి ధన్యవాదాలు” అంటూ కొన్ని ఫోటోస్ షేర్ చేసింది. అందులోనూ క్లింకార ముఖాన్ని చూపించకుండా జాగ్రత్తలు తీసుకుంది.

దీంతో ఉపాసన పోస్ట్ పై మెగా ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. మెగా ప్రిన్సెస్‏ను మాకెప్పుడు చూపిస్తారు.. క్లింకారను చూపించడి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవలే తన కుటుంబంతో కలిసి అయోధ్యను సందర్శించారు ఉపాసన. తన తాతయ్య అపోలో వ్యవస్థాపకుడు.. చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి.. అమ్మమ్మ సుచరిత రెడ్డితో కలిసి బాలరాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిసారు. అనంతరం తన తాతయ్య అపోలో చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి లెగసీని వివరించే ది అపోలో స్టోరీ అనే బుక్ ను సీఎం యోగి ఆదిత్యనాథ్ కు అందచేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.