ఎట్టకేలకు సినీ ప్రియుల ఎదురుచూపులకు కొంతవరకు తెర పడింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ హనుమాన్ ఓటీటీలోకి వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుని పెద్ద సినిమాలతో పోటీపడి మరీ రికార్డ్ స్థాయిలో వసూళ్లతో అదరగొట్టిన ఈ చిత్రాన్ని డిజిటల్ ప్లాట్ ఫామ్ పై చూసేందుకు అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. సంక్రాంతి బరిలో విడుదలైన చిత్రాలన్నీ ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యాయి. కానీ హనుమాన్ మాత్రం ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని కనీసం ప్రకటించలేదు కూడా. దీంతో ఈమూవీ స్ట్రీమింగ్ అప్డేట్ కావాలంటూ నెట్టింట గోల చేశారు ఫ్యాన్స్. అయితే ఇప్పటికీ ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ఇంట్రెస్ట్ పోయిందంటూ సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు సైలెంట్ గా హనుమాన్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో సినిమా హనుమాన్ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. కేవలం హిందీ వెర్షన్ మాత్రమే జియో సినిమా ఓటీటీలో చూడొచ్చు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల స్ట్రీమింగ్ హక్కులను జీ5 సంస్థ సొంతం చేసుకోగా.. కేవలం హిందీ వెర్షన్ హక్కులను జియో సినిమా దక్కించుకుంది. ప్రస్తుతం హనుమాన్ హిందీ వెర్షన్ ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇక ఈ వారం ఫుల్ బజ్ ఉన్న సినిమాల్లో హనుమాన్ నంబర్ వన్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత యానిమల్, డంకీ చిత్రాలు ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు.
ప్రముఖ ఆర్మాక్స్ మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఫోటోను ప్రశాంత్ వర్మ అభిమానులతో పంచుకున్నారు. ఇదిలా ఉంటే.. తెలుగు వెర్షన్ ఓటీటీ స్ట్రీమింగ్ పై ఇప్పటివరకు అప్డేట్ రాలేదు. త్వరలోనే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ అప్డేట్ రానుందంటూ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. హనుమాన్ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను, అమృతా అయ్యార్ కీలకపాత్రలలో నటించారు.
— Prasanth Varma (@PrasanthVarma) March 16, 2024
Lifting your spirits high for the weekend with #HanuManWallPapers https://t.co/2N773sLKY7#HanuMan pic.twitter.com/LxRfY9NiBu
— Prasanth Varma (@PrasanthVarma) March 15, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.