Most Recent

HanuMan OTT : హనుమాన్ ఓటీటీలో ఆ సీన్స్ కట్ చేశారా..? మరి ఎనిమిది నిముషాలు ఏమైంది.?

HanuMan OTT : హనుమాన్ ఓటీటీలో ఆ సీన్స్ కట్ చేశారా..? మరి ఎనిమిది నిముషాలు ఏమైంది.?

సంక్రాంతి బరిలో ఈసారి పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటితో పాటే హనుమాన్ సినిమా కూడా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. చిన్న సినిమా గా వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన హనుమాన్ సినిమా సంచలన విజయం సాధించడంతో పాటు భారీగా వసూళ్లను రాబట్టింది. చిన్న సినిమాగా రిలీజ్ అయిన హనుమాన్ సినిమా 400కోట్లవరకు వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. దేశవ్యాప్తంగా ఈ సినిమా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ మూవీ ఓటీటీ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హనుమాన్ కు పోటీగా వచ్చిన సినిమాలన్నీ ముందుగా ఓటీటీకి వచ్చినా హనుమాన్ సినిమా మాత్రం చాలా ఆలస్యంగా ఓటీటీలోకి వచ్చింది. ఈనెల 17 అంటే ఆదివారం రోజున ఓటీటీలో రిలీజ్ చేశారు.

ముందుగా హనుమాన్ సినిమా హిందీ వర్షన్ ను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారంటూ ప్రచారం జరిగింది. అలాగే హిందీ వర్షన్ రిలీజ్ అయిన రోజే టీవీలోనూ టెలికాస్ట్ అయ్యింది ఈ మూవీ. అయితే హనుమాన్ తెలుగు వర్షన్ రిలీజ్ అవ్వడానికి టైమ్ పడుతుందని అనుకున్నారు అంతా.. కానీ సడన్ గా ఈ నెల 17మా తెలుగు వర్షన్ కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకు ఓటీటీలో విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతుంది హనుమాన్ సినిమా..

ఇదిలా ఉంటే థియేటర్స్ రన్ టైమ్ కంటే ఓటీటీ రన్ టైమ్ ఎనిమిది నిముషాలు తక్కువ ఉంది. హిందీ వర్షన్ మాత్రం థియేటర్ రన్ టైమ్ తో మ్యాచ్ అవుతుంది. దాంతో హనుమాన్ తెలుగు వర్షన్ లో ఎనిమిది నిముషాలు కట్ చేశారని అంతా అనుకుంటున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే.. హిందీ వర్షన్ లో 2 గంటల 38 నిముషాలు ఉన్న హనుమాన్ తెలుగులో మాత్రం 2 గంటల 30 నిమిషాలే మాత్రమే ఉంది. అయితే ఫ్రేమ్ రేట్ లో వచ్చిన మార్పువల్ల ఆ ఎనిమిది నిమిషాల సమయం తగ్గిందంట.. సీన్స్ ఏమి కట్ చేయలేదు.. తెలుగు వర్షన్ మైక్రో సెకండ్ల తేడాతో కొంచెం వేగంగా రన్ అవ్వడంతో ఎనిమిది నిముషాలు తేడా వచ్చిందట.. ఇది తెలియక కొంతమంది హనుమాన్ సినిమాలో ఎదో సీన్ కట్ చేశారు అని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

హనుమాన్

 

View this post on Instagram

 

A post shared by Hanu⭐Man (@tejasajja123)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

 

 

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.