ప్రేమ ఖైదీ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అమలాపాల్. ఆతర్వాత లవ్ ఫెయిల్యూర్ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయింది. తెలుగు, తమిళ్ భాషల్లో పలు సినిమాల్లో నటించిన ఈ చిన్నది.. ధనుష్, రామ్ చరణ్, దళపతి విజయ్ ల సరసన నటించింది. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించి మెప్పించింది ఈ బ్యూటీ. ఆమె అనే సినిమాలో ఏకంగా నగ్నంగా నటించి షాక్ ఇచ్చింది. ఇక ఈ అమ్మడు వ్యక్తిగత విషయాలతోనూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. గతంలో అమల పాల్ తమిళ్ దర్శకుడు ఎల్ విజయ్ ను ప్రేమించి పెళ్లాడింది. ఆతర్వాత ఈ ఇద్దరూ విడిపోయారు. అమలాపాల్ , విజయ్ ఎందుకు విడిపోయారని ఫ్యాన్స్ ఇప్పటికి చర్చించుకుంటున్నారు.
ఆతర్వాత అమలాపాల్ ఇటీవల రెండో పెళ్లి చేసుకుంది ఈ బ్యూటీ. పెళ్లి తర్వాత మొగుడితో కలిసి తెగ ఫోటోలు , వీడియోలు షేర్ చేస్తుంది. ఇక ఇప్పుడు ఈ చిన్నది గర్భం దాల్చింది. బేబీ బంప్ తో ఫోటోలు షేర్ చేస్తుంది ఈ చిన్నది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా అమల పాల్ సోషల్ మీడియాలో ఓ క్రేజీ పోస్ట్ షేర్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్ .. అమలా పాల్ త్వరలోనే కవల పిల్లలను కనబోతుందని ఫ్యాన్స్ అంటున్నారు.
అమలా పాల్ జగత్ దేశాయ్‌ను వివాహం చేసుకుంది. ఇక ఇప్పుడు కవల పిల్లలను కనబోతుందని ప్రచారం జరుగుతోంది. దాంతో ఫ్యాన్స్ ఆమెకు విషెస్ తెలుపుతున్నారు. తాజాగా అమలా పాల్ ఓ చిన్న పాపను ఎత్తుకొని ‘టూ హ్యాపీ కిడ్స్’ అనే క్యాప్షన్ ఇచ్చింది. దాంతో అమలాపాల్ త్వరలోనే కవలలకు జన్మనివ్వనుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకు అమలాపాల్ నిజంగానే కవలలకు జన్మనివ్వనుందా..? అన్నది త్వరలోనే క్లారిటీ రానుంది.
అమలాపాల్ ఇన్ స్టా గ్రామ్..
View this post on Instagram
అమలాపాల్ ఇన్ స్టా గ్రామ్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.