Most Recent

పాత్రకోసం ప్రాణం పెట్టడమంటే ఇదే.. 72 గంటలు కేవలం నీళ్లు మాత్రమే తాగి..

పాత్రకోసం ప్రాణం పెట్టడమంటే ఇదే.. 72 గంటలు కేవలం నీళ్లు మాత్రమే తాగి..

మలయాళ ఇండస్ట్రీలో టాలెంటెడ్ నటుల్లో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒకరు. మలయాళ చిత్రసీమలో ఓ వెలుగు వెలిగిన పృథ్వీరాజ్ సుకుమారన్ తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లోనూ నటిస్తూ దూసుకుపోతున్నారు. ఆయనకు ఇతర భాషల్లో అవకాశాలు వస్తూనే ఉంటాయి కానీ.. స్పెషల్ ఫీల్ లేని సినిమాలను మాత్రం అంగీకరించడం లేదు. ఈ విషయాన్నీ పృథ్వీరాజ్ స్వయంగా తెలిపారు. ప్రస్తుతం పృథ్వీరాజ్ ఆడుజీవితం అనే సినిమా చేస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ ఏ పాత్ర ఇచ్చినా న్యాయం చేస్తాడు..ఇప్పుడు ఆడుజీవితం సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డారు. ఈ సినిమా కోసం పృథ్వీరాజ్ 18 ఏళ్లు కేటాయించారు.

ఈ చిత్రానికి బ్లెస్సీ దర్శకత్వం వహించారు. కేరళకు చెందిన నజీబ్ అనే వ్యక్తి కేరళ నుంచి సౌదీ అరేబియాకు పని పని కోసం వెళ్తాడు. అక్కడ అతను మోసపోతాడు. ఆతర్వాత ఏం జరిగింది. అతను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కున్నాడు అనే దాన్ని ఆధారంగా ‘ఆడుజీవితం’ అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకం ఆధారంగా బ్లెస్సీ సినిమా తీశారు.

2009లో తొలిసారిగా బ్లెస్సీ సినిమా గురించి పృథ్వీరాజ్‌తో మాట్లాడారు. ఆ తర్వాత స్క్రిప్ట్ పనుల్లో బిజీ అయిపోయాడు బ్లెస్సీ. ఈ చిత్రం 2018లో షూటింగ్ పూర్తయ్యింది. ఆరేళ్ల తర్వాత అంటే 2024లో (మార్చి 28) సినిమా విడుదలవుతోంది ఈ మూవీ. ఈ సినిమా గురించి పృథ్వీరాజ్మాట్లాడుతూ.. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ షూట్ చేస్తున్నప్పుడు 98 కిలోల బరువు పెరిగాను. మొదటి డెజర్ట్ షూట్ పూర్తయిన తర్వాత, నేను 31 కిలోల బరువు తగ్గాను. అప్పుడు నా శరీర బరువు 67 కిలోలు. నన్ను చూసి దర్శకుడు తో పాటు.. చిత్ర బృందం అంతా షాక్ అయ్యారు. ఈ సినిమాలో ఎడారిలో తప్పిపోయిన వ్యక్తి ఆకలితో ఎలా ఉంటాడో అలా కనిపించాలని నేను ప్రయత్నించా.. అందుకోసం తిండి మానేశా.. 72 గంటల పాటు కేవలం మంచినీళ్లు, కొద్దిగా బ్లాక్‌ కాఫీ మాత్రమే తాగేవాడిని అని తెలిపారు పృథ్వీరాజ్.

పృథ్వీరాజ్ ట్విట్టర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.