Most Recent

Salaar Movie: మరోసారి విడుదల కానున్న ‘సలార్’.. కానీ ఈసారి వేసవిలో అలా రిలీజ్..

Salaar Movie: మరోసారి విడుదల కానున్న ‘సలార్’.. కానీ ఈసారి వేసవిలో అలా రిలీజ్..

సలార్ .. పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద విజయాన్ని సాధించిన సినిమా. డైరెక్టర్ ప్రశాంత్ నీల్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో వచ్చిన ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకు ఉన్న రికార్డ్స్ లను ఈ చిత్రం బ్రేక్ చేసింంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది. డిసెంబర్ విడుదలైన ఈ మూవీకి అన్ని భాషల్లోనూ ఊహించని రేంజ్ లో రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ జోరు తగ్గడం లేదు. ఇందులో శ్రుతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలకపాత్రలలో నటించగా.. రవి బస్రూర్ సంగీతం అందించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. కేవలం మనదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఈ మూవీ సత్తా చాటుతుంది. ఈ క్రమంలో అభిమానులకు మరో గుడ్ న్యూస్ అందించారు మేకర్స్.

అదేంటంటే.. సలార్ సినిమాను మరోసారి ఈ వేసవిలో విడుదల చేయనున్నారట. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కానీ ఇక్కడే అసలు విషయం దాగుంది. సలార్ సినిమాను జపాన్ లో రిలీజ్ చేసేందుకు సిద్దమయ్యారు మేకర్స్. బాహుబలి సినిమాలతో ప్రభాస్ కు జపాన్ లో ఓ రేంజ్ క్రేజ్ క్రియేట్ అయ్యింది. దీంతో ప్రభాస్ ప్రతి కొత్త సినిమా అక్కడ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు సలార్ కూడా రిలీజ్ అయ్యింది. అది తెలుగు బాషతో జపాన్ సబ్ టైటిల్స్ తో రిలీజ్ అయ్యింది.

కానీ ఇప్పుడు జపాన్ భాషలోనే సలార్ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. కానీ ఇందుకు చాలా సమయం తీసుకుంటున్నారు. ఈ ఏడాది వేసవిలో ఈ సినిమాను జపాన్ భాషలో విడుదల చేయనున్నారు. అంటే దాదుపు ఐదు నెలల తర్వాత ఈ సినిమాను జపాన్ భాషలో విడుదల చేయనున్నారు. అలాగే సలార్ సినిమాను స్పానిష్ వెర్షన్ ను రిలీజ్ చేయనున్నారు. మార్చి 7న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. దీంతో సలార్ కలెక్షన్స్ మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది. అలాగే త్వరలోనే సలార్ సెకండ్ పార్ట్ షూటింగ్ స్టార్ట్ కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.