Most Recent

Saindhav Movie: ‘సైంధవ్’కి పెరిగిన రెస్పాన్స్.. అమెరికాలో వెంకీ మామ క్రేజ్.. ఎంత వసూలు చేసిందంటే..

Saindhav Movie: ‘సైంధవ్’కి పెరిగిన రెస్పాన్స్.. అమెరికాలో వెంకీ మామ క్రేజ్.. ఎంత వసూలు చేసిందంటే..

విక్టరీ వెంకటేష్ హీరోగా డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించిన సినిమా సైంధవ్. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఇందులో మరోసారి తన నటనతో అదరగొట్టేశాడు వెంకీ. ఇందులో శ్రద్ధ శ్రీనాథ్, బాలీవుడ్ నటుడు నవాజుద్ధీన్ సిద్దిఖీ కీలకపాత్రలు పోషించగా.. నిహారికా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి నిర్మించారు. ఈ చిత్రానికి రోజు రోజుకీ మరింత డిమాండ్ పెరుగుతుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతుంది సైంధవ్. సంక్రాంతి కానుకగా విడుదలైన అన్ని చిత్రాలు సూపర్ హిట్ అందుకున్నాయి. ఇటు సైంధవ్ సినిమాకు మరింత ఆదరణ లభిస్తుంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా యూఎస్ఏలో 200కె డాలర్స్ కి పైగా వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక భారతదేశంలో మొదటి రోజు రూ.3.8 కోట్లు రాబట్టిన ఈ సినిమా రెండో రోజు రూ.2.85 కోట్లు.. మూడవ రోజు రూ.3.35 కోట్లు రాబట్టింది. అటు అమెరికాలోనూ వెంకీమామ క్రేజ్ కొనసాగుతుంది. కూతురి ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఒక తండ్రి పడే ఆరాటం.. వెన్నెమూక కండరాల సమస్యతో బాధపడుతున్న ఆ చిన్నారిని రక్షించుకోవడానికి.. రూ.17 కోట్లు విలువైన ఇంజక్షన్ ను వెంకీ ఎలా సంపాదించాడు ? ఎలాంటి అవాంతరాలు ఎదుర్కొన్నాడు ? అనేది సినిమా.

ఈ సినిమా వెంకీ 75వ మూవీగా తెరకెక్కింది. హిట్ 1, 2 తర్వాత డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించిన సినిమా ఇదే. దీనికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. వెంకీ పవర్ ఫుల్ యాక్టింగ్, శైలేష్ కొలను దర్శకత్వం, యాక్షన్, ఎమోషనల్ అంశాలకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.