Most Recent

Raja Saab Movie: డార్లింగ్ ‘రాజా సాబ్’ స్టోరీ చెప్పేసిన IMDB.. ఫన్నీగా కౌంటరిచ్చిన డైరెక్టర్ మారుతీ..

Raja Saab Movie: డార్లింగ్ ‘రాజా సాబ్’ స్టోరీ చెప్పేసిన IMDB.. ఫన్నీగా కౌంటరిచ్చిన డైరెక్టర్ మారుతీ..

సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో చాలా కాలం తర్వాత ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అందించాడు ప్రభాస్. దీంతో ఇప్పుడు ఆయన నెక్ట్స్ మూవీస్ పై మరింత బజ్ ఏర్పడింది. ఇప్పటికే నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు త్వరలోనే సందీప్ వంగా మూవీ షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. ఇక ఇప్పుడు అందరి చూపు డైరెక్టర్ మారుతీ సినిమాపైనే పడింది. ఇన్నాళ్లు సైలెంట్‏గా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా గురించి ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చింది. వీరిద్దరి కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్ టైటిల్ రాజా సాబ్ అంటూ క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. సంక్రాంతి కానుకగా సినిమా టైటిల్ తోపాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో వింటేజ్ ప్రభాస్ ను చూపించి అభిమానులను ఖుషి చేయబోతున్నారు.

ఫస్ట్ లుక్ పోస్టర్ లో.. డార్లింగ్ లుక్ మూవీపై మరింత క్యూరియాసిటిని కలిగించింది. దీంతో ఈసారి మారుతీ వింటేజ్ ప్రభాస్ ను చూపించబోతున్నారని అర్థమవుతుంది. అయితే ఈ క్రమంలోనే ప్రముఖ మూవీ రేటింగ్ వెబ్ సైట్ IMDB.. వెబ్ సైట్ లో రాజా సాబ్ స్టోరీ లైన్ గురించి రాసుకొచ్చింది. “ఈ సినిమా కథ ఒక కపుల్ చుట్టూ తిరుగుతుందట.. ప్రేమలో పడిన ఇద్దరి వ్యక్తుల డెస్టినీ నెగటివ్ ఎనర్జీ వల్ల వేరే దారి మళ్లుతుంది” అని పేర్కొంది. ఇక ఇది చూసిన డైరెక్టర్ మారుతీ ఫన్నీగా రియాక్ట్ అవుతూనే IMDBకి కౌంటరిచ్చారు.

“అరెరే.. నాకు ఇది తెలియక.. వేరే స్క్రిప్ట్ తో సినిమా షూట్ చేస్తున్నానే..మరి ఈ కథని IMDB సమాజం అంగీకరిస్తుందా ?” అంటూ తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం మారుతీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఇక అటు ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమా హారర్ బ్యాక్ డ్రాప్ తో సాగుతుందని తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ పాత్ర చాలా ఎంటర్టైన్ గా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో మాళవిక మోహనన్ నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ 50 శాతం కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.