Most Recent

Prabhas: భీమవరంలో ప్రభాస్‌ భారీ ఎల్‌ఈడీ కటౌట్‌.. మారుతి మూవీ ఫస్ట్‌ లుక్ లాంఛ్‌ కోసం ఏర్పాట్లు.. వీడియో

Prabhas: భీమవరంలో ప్రభాస్‌ భారీ ఎల్‌ఈడీ కటౌట్‌.. మారుతి మూవీ ఫస్ట్‌ లుక్ లాంఛ్‌ కోసం ఏర్పాట్లు.. వీడియో

సలార్‌తో మళ్లీ సక్సెస్‌ ట్రాక్‌లోకి వచ్చాడు పాన్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ ప్రభాస్‌. డిసెంబర్‌ 22న విడుదలైన ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది. ఇప్పుడిదే సక్సెస్‌ జోష్‌ ను కంటిన్యూ చేసే పనిలో ఉన్నాడు డార్లింగ్‌. అందుకే బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెట్టాడు. ప్రస్తుతం టాలీవుడ్‌ డైరెక్టర్‌ మారుతి మార్గదర్శకత్వంలో ఓ హార్రర్‌ కామెడీ థ్రిల్లర్‌ సినిమాలో నటిస్తున్నాడు ప్రభాస్‌. మలయాళ భామ మాళవికా మోహనన్‌ హీరోయిన్‌. రాజీ డీలక్స్‌ (వర్కింగ్‌ టైటిల్‌) పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో రిద్ది కుమార్‌ మరో ఫీమేల్‌ లీడ్ రోల్‌ పోషిస్తోంది. ఇప్పటికే పోస్టర్స్‌తో ఆసక్తిని పెంచేసిన ఈ మూవీ నుంచి మరో కీలక అప్డేట్‌ రానుంది. సంక్రాంతి పండగ సందర్భంగా ఫస్ట్‌ లుక్‌ తో పాటు టైటిల్‌ ను లాంఛ్‌ చేయనున్నారు. ఈ నేపథ్యంలో భీమవరంలో ప్రభాస్‌ భారీ కటౌట్‌ను లాంఛ్ చేయనున్నారు. పూర్తిగా ఎల్‌ఈడీ లైట్లతో డిజిటల్‌ కటౌట్‌ను రెడీ చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు. ఈ ఏర్పాట్లకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. సోమవారం (జనవరి 15) ఉదయమే ఈ కటౌట్‌ను లాంఛ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది.

ప్రభాస్‌- మారుతి కాంబినేషన్‌ లో వస్తోన్న సినిమాను పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మించనున్నారు. ప్రభాస్‌ను తన తరహా స్టైల్‌లో కొత్తగా ప్రజెంట్ చేయనున్నట్లు డైరెక్టర్‌ మారుతి చెప్పుకొచ్చాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్స్‌, ఫొటోస్‌ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ముఖ్యంగా నుదుటున బొట్టు, లాంగ్‌ హెయిర్‌ గడ్డంతో ఉన్న ప్రభాస్‌ స్టిల్స్‌ అభిమానులకు తెగ నచ్చేశాయి. అలాగే హీరోయిన్‌ రిద్ది కుమార్‌తో క్లోజప్‌ యాంగిల్‌ లో ఉన్న స్టిల్‌ ఒకటి నెట్టింట వైరలవుతోంది. సో.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ గెట్ రెడీ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.