తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో కలిసి పండగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సెలబ్రిటీలు కూడా తమ ఫ్యామిలీతో కలిసి పొంగల్ పండగను జరుపుకొంటున్నారు. అనంతరం ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అలా సంక్రాంతి సెలబ్రేషన్స్‌కు సంబంధించి మెగా ఫ్యామిలీ షేర్ చేసుకున్న ఫొటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. మెగా ఫ్యామిలీతో పాటు అల్లు కుటుంబ సభ్యులందరూ ఈ వేడుకలో భాగమయ్యారు. ఇందుకు బెంగళూరులోని ఫామ్ హౌస్ వేదికగా మారింది. అయితే మెగా ఫ్యామిలీ సంక్రాంతి సంబరాల్లోపవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రం పాల్గొన లేదు. రాజకీయాల్లో బిజీగా ఉన్నందున అతను ఈ వేడుకలకు హాజరుకాలేకపోయాడు. అయితే అతని పిల్లలు మాత్రం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. సంప్రదాయ దుస్తుల్లో అకీరా నందన్, ఆద్య అందరి దృష్టినీ ఆకర్షించారు. మెగా స్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా వేదికల్లో ఈ ఫొటోస్ ను షేర్ చేశారు ‘పాడి పంటల,భోగ భాగ్యాల ఈ సంక్రాంతి ప్రతి ఇంటా ఆనందాల పంటలు పండించాలని ఆశిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు’ అని విషెస్ తెలిపారుజ
ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి ఈసారి సంక్రాంతి చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే రామ్ చరణ్- ఉపాసనల కూతురు క్లీంకార కొణిదెల ఇదే తొలి సంక్రాంతి పండగ. అలాగే గతేడాది నవంబరులో పెళ్లి చేసుకున్న వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి దంపతులకు కూడా ఇదే మొదటి సంక్రాంతి కావడం విశేషం. సంక్రాంతి సంబరాల కోసం మెగా ఫ్యామిలీ మొత్తం రెండు రోజుల పాటు బెంగళూరులోనే ఉండనుందని తెలుస్తోంది. ప్రస్తుతం వీరి ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోల్లో మగవాళ్లు అందరూ లైట్ బ్రౌన్ కలర్ కుర్తాలో కనిపించగా.. ఆడవాళ్లందరూ రెడ్ శారీలో దర్శనమిచ్చారు. మొత్తానికి ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతోంది. ముఖ్యంగా మెగా అభిమానులకు రెండు కళ్లు సరిపోవట్లేదు.
పాడి పంటల,భోగ భాగ్యాల ఈ సంక్రాంతి
ప్రతి ఇంటా ఆనందాల పంటలు పండించాలని ఆశిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ! pic.twitter.com/4rpfN0s6lZ— Chiranjeevi Konidela (@KChiruTweets) January 15, 2024
మెగా 156 టైటిల్ ఖరారు..
Beyond the universe and beyond the celestial realms, comes a light of hope – 𝗩𝗜𝗦𝗛𝗪𝗔𝗠𝗕𝗛𝗔𝗥𝗔 #Mega156 is #Vishwambhara
Title and concept video out now!
– https://t.co/hm9wO9nyawIn cinemas Sankranthi 2025.@DirVassishta @mmkeeravaani @boselyricist @NaiduChota… pic.twitter.com/fOyCDIMV3M
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 15, 2024