Most Recent

Meenakshi Chaudhary: అలాంటి సీన్స్‌లో నటిస్తా.. కానీ.. మీనాక్షి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Meenakshi Chaudhary: అలాంటి సీన్స్‌లో నటిస్తా.. కానీ.. మీనాక్షి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

హీరోయిన్ గా ఇండస్ట్రీలో రాణించాలి అంటే నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటున్నారు హీరోయిన్స్. ఛాన్స్ వస్తే అవార్డు విన్నింగ్ లెవల్ లో పర్ఫామ్ చేసి స్టార్ గా మారాలని యంగ్ హీరోయిన్స్ ట్రై చేస్తున్నారు. ఈ బ్యూటీ కూడా ఛాన్స్ వస్తే ఎలాంటి పాత్ర అయినా చేస్తా అంటుంది. మీనాక్షి చౌదరి.. ఈ అమ్మడి పేరు ఈ మధ్యకాలంలో బాగానే వినిపిస్తుంది. కెరీర్ స్టార్టింగ్ లో అంతగా అవకాశాలు అందుకోలేకపోయిన మీనాక్షి.. ఇప్పుడు మంచి ఆఫర్స్ అందుకుంటుంది. ఇచ్చట వాహనములు నిలుపరాదు  అనే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది మీనాక్షి. తొలి సినిమా డిజాస్టర్ గా నిలిచినా.. మీనాక్షి కి మంచి మార్కులు పడ్డాయి. ఆతర్వాత మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన ఖిలాడీ సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఈ సినిమాలో నటనతో పాటు గ్లామర్ తోనూ ఆకట్టుకుంది.

రీసెంట్ గా మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. మీనాక్షి ఈ సినిమాలో కనిపించింది చాలా తక్కువ సేపే అయినా మంచి మార్కులే కొట్టేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

మహేష్ బాబుతో సినిమా అనగానే నేను చాలా సంతోషించా..మొదటి రోజే మహేష్ బాబు గారితో షూట్ చేశా.. మొదట్లో కంగారు పడ్డాను.. దాంతో మహేష్ గారు నువ్వు టెన్షన్ పడకు.. కాస్త టైం తీసుకొని రిలాక్స్ అవ్వు అని దైర్యం చెప్పారు అని తెలిపింది. అలాగే నేను కొన్ని రూల్స్ పెట్టుకున్నా.. సినిమాలో కిస్ సీన్స్ విషయంలో నేను కొన్ని రూల్స్ పెట్టుకున్నాను. స్క్రిప్ట్‌ డిమాండ్‌ను చేస్తే తప్ప ముద్దు సీన్స్‌కు ఒప్పుకోను. మరీ అసభ్యకరంగా ఉంటే చేయను. తెలుగు ఆడియన్స్ నా పై చాలా ప్రేమ చూపిస్తున్నారు. రెమ్యునరేషన్ కంటే.. నటనకే ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తా.. అని చెప్పుకొచ్చింది.

మీనాక్షి చౌదరి ఇన్ స్టా గ్రామ్..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.