Most Recent

Sanjay Dutt: సౌత్ ఇండస్ట్రీలో సంజయ్ దత్ హవా.. ‘డబుల్ ఇస్మార్ట్’ కోసం రెమ్యునరేషన్ ఎంతంటే..

Sanjay Dutt: సౌత్ ఇండస్ట్రీలో సంజయ్ దత్ హవా.. ‘డబుల్ ఇస్మార్ట్’ కోసం రెమ్యునరేషన్ ఎంతంటే..

ఇటీవల స్కంద సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు హీరో రామ్ పోతినేని. డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఇక ప్రస్తుతం రామ్ డబుల్ ఇస్మార్ట్ కోసం సిద్ధమవుతున్నారు. హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్‏గా వస్తోన్న ఈ సినిమాకు డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా ఈ మూవీని తీసుకురాబోతున్నారు పూరీ. ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. అయితే ఇందులో నటించేందుకు సంజయ్ దత్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లో వార్త వైరలవుతుంది. ఈ సినిమా కోసం భారీగానే ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమా కోసం సంజయ్ దత్ ఏకంగా రూ.6 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని వార్త ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది. కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత సంజయ్ దత్ మార్కెట్ పెరిగిందన్న సంగతి తెలిసిందే. ఇటు సౌత్ ఇండస్ట్రీలో ఆయనకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే సంజయ్ దత రెమ్యునరేషన్ సైతం పెంచేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే డబుల్ ఇస్మార్ట్ సినిమా కోసం భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్.

ఇదిలా ఉంటే.. డబుల్ ఇస్మార్ట్ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇందులో మరోసారి రామ్ మాస్ యాక్షన్ హీరోగా రగ్గడ్ లుక్‏లో కనిపించనున్నారు. ఇటీవలే సెట్స్ లో రామ్ సెల్ఫీ తీసుకుంటున్న ఫోటోను షేర్ చేసింది నిర్మాణ సంస్థ పూరీ కనెక్ట్స్. అందులో రామ్ లుక్ చూస్తుంటే మరోసారి రగ్గడ్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబైలో జరుగుతుండగా.. వచ్చే ఏడాది మార్చి 8న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.