Most Recent

Rashmika Mandanna: నెట్టింట రష్మిక ఫేక్ వీడియో వైరల్.. అమితాబ్ సీరియస్.. కేసు వేయాల్సిందేనంటూ ..

Rashmika Mandanna: నెట్టింట రష్మిక ఫేక్ వీడియో వైరల్.. అమితాబ్ సీరియస్.. కేసు వేయాల్సిందేనంటూ ..

కిరిక్ పార్టీ సినిమాతో కన్నడ సినీ పరిశ్రమలోకి నటిగా అరంగేట్రం చేసింది రష్మిక మందన్నా. ఆ తర్వాత తెలుగులో వరుస హిట్స్ అందుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. తెలుగులో గీతా గోవిందం సినిమాతో రష్మిక క్రేజ్ మారిపోయింది. ఇక ఆ తర్వాత డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా గుర్తింపు తెచ్చుకుంది. ఈసినిమా ఎఫెక్ట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ క్యూకట్టాయి. ఇప్పటికే గుడ్ బై, మిషన్ మజ్ను సినిమాలతో నార్త్ అడియన్స్‏ను ఆకట్టుకున్న ఈ నేషనల్ క్రష్.. ఇప్పుడు యానిమల్ సినిమాతో మెప్పించేందుకు రెడీ అవుతుంది. రణబీర్ కపూర్ నటిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే హైప్ పెరిగిపోయింది. ఇదిలా ఉంటే.. తాజాగా సోషల్ మీడియాలో రష్మికకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరలవుతుంది. ఆ వీడియోలో ఉన్నది రష్మిక కాదని స్పష్టంగా అర్థమవుతుంది.. ఈ వీడియోపై అమితాబ్ సీరియస్ అయ్యారు.

ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్న వీడియోలో.. రష్మిక బోల్డ్‏గా కనిపిస్తుంది. అలాగే ఆమె ఫారిన్ స్లాంగ్ మాట్లాడడం చూస్తే అది పక్కా ఫేక్ వీడియో అని..ఏఐతో మార్పింగ్ చేశారని అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుండగా.. సినీ ప్రముఖులు, నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఈ వీడియోపై బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముందుగా ఈ వీడియోను జర్నలిస్ట్ అభిషేక్ షేర్ చేస్తూ.. ఆ వీడియోలో ఉన్న యువతి జారా పటేల్ అని తెల్చేశారు. కానీ ఎవరో రష్మిక ఫోటోను మార్ఫింగ్ చేసి నెట్టింట షేర్ చేశారు. అయితే ఆ వీడియోలో ఉన్నది రష్మిక అని చాలా మంది భ్రమపడ్డారు. ఇక ఈ వీడియోపై అమితాబ్ స్పందిస్తూ.. ఇలాంటి ఫేక్ వీడియోస్ మార్ఫింగ్ చేసేవారిని కఠినంగా శిక్షించాలంటూ ట్వీట్ చేశారు.

ప్రస్తుతం రష్మిక యానిమల్, పుష్ప 2 చిత్రాల్లో నటిస్తుంది. ఇందులో పుష్ప 2 చిత్రీకరణ జరుపుకుంటుండగా.. యానిమల్ త్వరలోనే రిలీజ్ కానుంది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో రణబీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.