
అక్కినేని యువ హీరో నాగ చైతన్య హిట్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ, కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో వచ్చిన బంగార్రాజు సినిమాల తర్వాత హిట్ అందుకోలేకపోయారు చైతు. ఆ వెంటనే వచ్చిన థాంక్యూ, లాల్ సింగ్ చద్దా, కస్టడీ సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దాంతో ఇప్పుడు హిట్ కొట్టాలన్న కసి మీదున్నారు. దాంతో బలమైన కథను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా మత్యకారుల జీవిత నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ‘బన్నీ’ వాసు తెరకెక్కిస్తున్నారు. దాంతో చైతూ వారి జీవన విధానం తెలుసుకునేందుకు మత్యకారులను కలిశారు. శ్రీకాకుళంలోని మత్స్యకారులను స్వయంగా కలిసి వారి జీవన విధానం, అక్కడ ఉండే పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు.
నాగ చైతన్య
జోష్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నాగ చైతన్య. తొలి సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా.. థన్ నటనతో ఆకట్టుకున్నాడు ఈ కుర్రహీరో. ఆతర్వాత వచ్చిన ఏ మాయ చేశావే సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ అందమైన ప్రేమ కథ యువతను విపరీతంగా ఆకట్టుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు నాగ చైతన్య. ఇప్పటివరకు 27 సినిమాల్లో నటించారు నాగ చైతన్య.
అదే ఫార్ములా
ఇటీవల వస్తున్న సినిమాలన్నీ సముద్రం బ్యాక్డ్రాప్ లోనే ఉంటున్నాయి. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా కూడా సముద్రం నేపథ్యంలోనే ఉంది. ఈ సినిమాలో చిరంజీవి తన వింటేజ్ లుక్ తో కనిపించడంతో పాటు సాలిడ్ హిట్ అందుకున్నారు. ఆతర్వాత ఇప్పుడు తారక్ కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న నయా మూవీ దేవర. ఈ సినిమా కూడా సముద్రం నేపథ్యంలోనే ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమా పై అంచనాలను పెంచేశాయి. ఈ ఇద్దరి మాదిరిగానే ఇప్పుడు కుర్ర హీరో నాగ చైతన్య కూడా సముద్రం బ్యాక్డ్రాప్ ఉన్న కథను ఎంచుకున్నారు. ఇందుకు కోసం వారి జీవన విధానం గురించి.. చేపలు ఎలా పడుతారో తెలుసుకుంటున్నారు. జాలరులతో పాటు వేటకు కూడా వెళ్లారని తెలుస్తోంది. మరి ఈ సినిమా నాగ చైతన్యకి ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.
View this post on Instagram