
సీనియర్ నటీనటులు వీకే నరేశ్, పవిత్రా లోకేశ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం మళ్లీ పెళ్లీ. వీరి నిజజీవితంలో జరిగిన సంఘటలను ఆధారంగా చేసుకుని సీనియర్ దర్శక నిర్మాత ఎం ఎస్ రాజు ఈ సినిమాను తెరకెక్కించారు. పోస్టర్స్, టీజర్లు, ట్రైలర్స్‌తో ఆసక్తి పెంచేసిన మళ్లీ పెళ్లీ తీరా థియేటర్లలోకి వచ్చాక పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మే 26న విడుదలైన ఈ మూవీ ఫ్లాప్‌గా నిలిచింది. అయితే నరేశ్, పవిత్రల రియల్ స్టోరీ కావడంతో చాలామంది ఈ మూవీని చూసేందుకు ఆసక్తి చూపించారు. అందుకే ఓటీటీల్లో బాగానే రెస్పాన్స్ వచ్చింది. ఆహాతో పాటు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోల్లోనూ మళ్లీ పెళ్లీ స్ట్రీమింగ్ అయ్యింది. దీనిపై నరేష్ మూడో సతీమణి కోర్టుకెక్కింది. అయితే కోర్టు ఆమె వాదనను తోసిపుచ్చి సినిమా రిలీజ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఓటీటీతో పాటు శాటిలైట్లలో ఎలాంటి అడ్డంకులు లేకుండా మళ్లీ పెళ్లీ సినిమాను ప్రదర్శించుకోవచ్చని క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో ఈ సినిమా ఇప్పుడు టీవీలోకి వచ్చేస్తోంది. స్టార్ మా ఛానెల్లో ఆదివారం (ఆగస్ట్ 13) మధ్యాహ్నం ఒంటి గంటకు నరేష్, పవిత్రా లోకేష్ ల సినిమా ప్రసారం కానుంది.
కాగా మళ్లీ పెళ్లీ సినిమాను విజయకృష్ణ మూవీస్ బ్యానర్‌పై వీకే నరేశ్ స్వయంగా నిర్మించాడు. వనితా విజయ్ కుమార్ నరేష్ సతీమణిగా ఓ కీ రోల్‌లో నటించింది. ఇక కొన్ని రోజలు క్రితం కన్నుమూసిన శరత్ బాబు ఆఖరిసారిగా వెండితెరపై కనిపించిన చిత్రం ఇదే. ఇందులో సూపర్ స్టార్ కృష్ణ పాత్రలో శరత్ బాబు నటించారు. ఇక ఆయన సతీమణి విజయ నిర్మల పాత్రలో సహజ నటి జయసుధ కనిపించారు. మరి థియేటర్లు, ఓటీటీల్లో మళ్లీ పెళ్లీ సినిమాను మిస్ అయిన వారు ఎంచెక్కా టీవీలో చూసి ఎంజాయ్ చేయండి.
Malli Pelli Movie Premieres 13th August 1pm Only on @StarMaa
#MalliPelli #MalliPelliOnPrime #NareshVK #PavitraLokesh #Jayasudha #SharathKumar #MSRaju #VanithaVijaykumar #VijayaKrishnaMovies #StarMaa #SriBalajiVideo pic.twitter.com/7W562yy29A
— Sri Balaji Video (@sribalajivideos) August 7, 2023
Voir cette publication sur Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..