
ఐశ్వర్య రాజేష్.. ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.. తెలుగమ్మాయే అయినప్పటికీ తమిళ్ సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. తమిళ్ లో స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది ఈ చిన్నది. అలాగే తెలుగులో కౌసల్య కృష్ణమూర్తి అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినప్పటికీ ఈ అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేసింది. మిస్ మ్యాచ్, వరల్డ్ ఫెమమ్స్ లవర్, టాక్ జగదీశ్, రిపబ్లిక్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. గ్లామర్ షో జోలికి పోకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తుంది. అంతే కాదు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ వయ్యారి. రకరకాల ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.
సోషల్ మీడియాలో ఈ చిన్నదానికి ఫాలోవర్స్ భారీగానే ఉన్నారు. ఇన్ స్టా గ్రామ్‌లో ఐశ్వర్య రాజేష్‌కు 3 మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం ఐశ్వర్య విదేశాల్లో విహరిస్తోంది. మెల్బోర్న్ అక్కడి నుంచి రకరకాల ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది. తాజాగా ఈ ఐశ్వర్య రాజేష్ షేర్ చేసిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.
డాల్ఫీన్ తో ఆటలాడుతున్న ఫోటోను షేర్ చేసింది ఐశ్వర్య రాజేష్. అయితే ఈ అమ్మడు డాల్ఫీన్ చేసిన పనికి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ వీడియోలో ముందుగా డాల్ఫీన్ ను ముట్టుకునేందుకు బయపడింది ఐశ్వర్య. ఆతర్వాత దాని మీద నీళ్లు పోస్తూ ఆటలాడింది. ఒక్కసారిగా ఆ డాల్ఫీన్ జర్క్ ఇవ్వడంతో భయపడిపోయింది ఐశ్వర్య రాజేష్. ఆతర్వాత దాంతో డాన్స్ కూడా చేసింది. ఇప్పుడు ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ వీడియో కాస్త ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ అమ్మడి సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం తమిళ్, మలయాళ సినిమాలతో బిజీగా ఉంది. రిపబ్లిక్ సినిమా తర్వాత మరో తెలుగు సినిమాలో కనిపించలేదు ఐశ్వర్య. అయితే స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లకోసం ఎదురుచూస్తుంది. బడా హీరోల సినిమాల్లో నటిస్తే ఈ అమ్మడి కెరీర్ పీక్స్ లో ఉంటుందంటున్నారు విశ్లేషకులు.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..