
యంగ్ హీరో నితిన్ వరుస ఫ్లాప్ లతో ఉన్న నితిన్ ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలన్న కసి మీదున్నాడు. దాంతో ఇప్పుడు విభిన్నమైన కథలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తనకు భీష్మ లాంటి హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. రైటర్ గా ఎన్నో అద్భుతమైన సినిమాలకు కథను అందించిన వక్కంతం వంశీ దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే. దర్శకుడిగా ఆయన అల్లు అర్జున్ తో కలిసి నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమా చేశారు. 2002లో వచ్చిన ఉదయ్ కిరణ్ కలుసుకోవాలని సినిమాతో రైటర్ గా కెరీర్ ప్రారంభించిన ఆ తర్వాత 2018 నా పేరు సూర్య నా ఇల్లు ఇండియాతో దర్శకుడిగా మారారు. ఇక ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.
ఈ సినిమా తర్వాత ఇప్పుడు మరోసారి దర్శకుడిగా తన సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. నితిన్ హీరోగా ఆయన ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ఎక్ స్ట్రా ఆర్డనరీ మ్యాన్ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలో నితిన్ కు జోడీగా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు.
ఈ సినిమాకు హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. డేంజర్ పిల్ల అంటూ సాగే ఈపాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ పాటలో శ్రీలీల అందాలు.. నితిన్ ఎనర్జీ ఆడియన్స్ ను అలరిస్తాని ఈ లిరికల్ సాంగ్ చూస్తే అర్ధమవుతుంది. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. అర్మాన్ మాలిక్ అద్భుతంగా అలరించారు. ఈ సినిమాను డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.